కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన విక్రమ్ సినిమా ఇంకా సంచలనాత్మక వసూళ్లను రాబడుతూనే ఉంది. ఈ సినిమా విడుదల జరిగి 20 రోజులు దాటు తున్నా కూడా ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ మామూలుగా లేదు. తమిళనాడుతో పాటు తెలుగునాట కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా మల్టీవర్స్ గా తెరకెక్కగా ఒక్కసారిగా ఈ సినిమా ఎంతో కొత్తదనాన్ని తీసుకు వచ్చింది. అందుకే అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా ను ఎగబడీ మరి చూస్తున్నారు. 

అయితే విడుదలైన దగ్గర నుంచి ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ ఉండగా తాజాగా బాహుబలి సినిమా రికార్డు కూడా దాటడం ఎంతో విశేషం. తమిళనాట బాహుబలి సినిమా 146 కోట్ల వసూళ్లను సాధించగా అదే సమయంలో ఈ సినిమా 150 కోట్ల వసూళ్లను సాధించడం విశేషం. ఏదేమైనా ఈ వయసులో కమలహాసన్ హీరోగా నటించిన సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టుకోవడం అంటే నిజంగా ఎంతో విశేషం అనే చెప్పాలి.  గతంలో అయన ఏ సినిమా కోడా ఇన్ని వసూళ్లను అందుకోలేదు. 

గత కొన్ని సినిమాలుగా కమల్ హాసన్ కు ఏమాత్రం కలిసి రావటం లేదు. ఆయన చేసిన సినిమాలు బాక్సాఫిస్ వద్ద అసలు విజయాన్ని అందుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చేయబోయే సినిమా విజయాన్ని అందుకోవాలని దర్శకుడితో కలిసి ఈ సినిమా చేశాడు. ఆ విధంగా డ్రగ్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమాలో ఫాహాద్ ఫజిల్ ఓ కీలక పాత్రలో నటించాడు. మరి ఇంకా రికార్డుల మీద రికార్డులను సృష్టిస్తున్న ఈ సినిమా భవిష్యత్తులో ఎలాంటి సంచలనాత్మక రికార్డును తన పేరిట లిఖించుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: