ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ కెరీర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇలా ఇంత కాలం పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగిన అల్లు అర్జున్ కొంత కాలం క్రితం విడుదల అయినపుడు పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ని సంపాదించుకున్నాడు .

పుష్ప పార్ట్ 1 సినిమా విజయంతో ఇండియా వ్యాప్తంగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న అల్లు అర్జున్ మరి కొన్ని రోజుల్లో పుష్ప పార్ట్ 2 మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతుంది.  ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ 'పుష్ప'  సినిమా తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు అని అనేక వార్తలు కొన్ని రోజుల క్రితం బయటకు వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే. కాక పోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్,  మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అని తెలుస్తోంది. దానికి ప్రధాన కారణం అల్లు అర్జున్  మొత్తం కాన్సన్ట్రేషన్ ను పుష్ప పార్ట్ 2 మూవీ పైనే పెట్టినట్లు తెలుస్తోంది. పుష్ప పార్ట్ 2 సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాతే ఏ సినిమాలో నటించాలి, ఎలాంటి కథలో నటించాలి అనేది అల్లు అర్జున్ డిసైడ్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది .

ఇది ఇలా ఉంటే ఇప్పటికే పుష్ప పార్ట్ 1 మూవీ మంచి విజయం సాధించడంతో దేశ వ్యాప్తంగా పుష్ప పార్ట్ 2 సినిమాపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. పుష్ప  సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించగా రష్మిక మందన పుష్ప మూవీ లో హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: