రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ సినిమాలో శృతి హసన్ , ప్రభాస్ సరసన కథానాయికగా కనిపించబోతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలం అవుతుంది .

మధ్యలో కొంత కాలం ప్రభాస్ ఇతర సినిమా షూటింగ్ లలో పాల్గొనడం, అలాగే ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా విడుదల పనుల్లో బిజీగా ఉండడంతో సలార్ సినిమా షూటింగ్ ఇంత కాలం పాటు చాలా స్లోగా జరిగింది .  ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమాకు బల్క్ డేట్స్ ఇవ్వడం,  అలాగే ప్రశాంత్ నీల్ కూడా ప్రస్తుతం సలార్ సినిమా పై ఫుల్ కాన్సన్ట్రేషన్  పెట్టడంతో సలార్ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది . ఇది ఇలా ఉంటే సలార్ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... సలార్ మూవీ కి యాక్షన్ సన్నివేశాలే హైలెట్ అంట .

మూవీ లో యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయే రేంజ్ లో వస్తున్నట్లు తెలుస్తోంది . అలాగే ఈ యాక్షన్ సన్నివేశాల కోసం ఇండియాలో ఏ సినిమాలో వాడని పరికరాలను, అలాగే వాహనాలను కూడా వాడుతున్నట్లు తెలుస్తోంది . అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్ 'సలార్' సినిమా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్లు , ఒక్కో యాక్షన్ సన్నివేశం ఒక రేంజ్ లో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇలా సలార్ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: