లోక నాయకుడు కమల్ హాసన్ తాజాగా విక్రమ్ మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమా అనేక అంచనాల నడుమ తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో జూన్ 3 వ తేదీన విడుదల అయ్యింది.

విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ హీరోగా నటించగా విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో నటించాడు . ఒక కీలకమైన పాత్రలో ఫహాద్ ఫాజిల్ నటించగా, సూర్య రోలెక్స్ అనే ఒక గెస్ట్ రోల్ లో నటించాడు. ఇలా హేమాహేమీలు అయినా నటీనటులు విక్రమ్ సినిమాలో ఉండటంతో ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలా భారీ అంచనాల నడుమ భారీ ఎత్తున విడుదల అయిన విక్రమ్ సినిమా విడుదల అయిన మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విక్రమ్ మూవీ 350 కోట్ల గ్రాస్ కలెక్షన్ మార్క్ ను టచ్ చేసి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇలా బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికే అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విక్రమ్ సినిమా 'ఓ టి టి' స్ట్రీమింగ్ కు సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతుంది.

విక్రమ్ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ 'ఓ టి టి' సంస్థ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్  విక్రమ్ సినిమాను జూలై 8 వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: