కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో బాగా సక్సెస్ అయిన సినిమా విక్రమ్. ఈ చిత్రం వేరే లెవెల్ లోకి భారీ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో సరికొత్త సందడి నెలకొంది. గత కొన్ని రోజులుగా కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో చెప్పుకోదగ్గ సినిమాలేవీ రాలేదు. కొన్ని సినిమాలు హిట్ అయినా కూడా అవి అంతగా కలెక్షన్స్ సాధించుకోలేదు. అలా ఇప్పుడు కోలీవుడ్ సినిమా పరిశ్రమ నుంచి వచ్చే సినిమాలు ఏవీ భారీ విజయాన్ని అందుకుంటయో అని అందరు ఎదురు చూడగా లోకేష్ దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమా సంచలన విజయాన్ని అందుకుని రికార్డుల మీద రికార్డులను సృష్టిస్తుంది.

ఈ పరిణామం ఒక్క సారిగా కోలీవుడ్ లో సరికొత్త జోరును తీసుకువచ్చింది. ప్రతి ఒక్కరి మేకర్ లో కూడా ఎంతో సందడి నీ తీసుకొచ్చింది. పాన్ ఇండియా సినిమాలు చేయడానికి టాలీవుడ్ సినిమా పరిశ్రమ ముందుకు వెళుతుంది దానికి పోటీగా ఇతర చిత్ర పరిశ్రమలు పాన్ ఇండియా సినిమాలు చేయడానికి సిద్ధం అవుతున్నాయి. అలాంటి ప్రయత్నం లో విక్రమ్ సినిమా రావడం అది కాస్తా సూపర్ హిట్ అవ్వడం తమిళ ప్రేక్షకులను ఎంతో సంతోషానికి గురిచేస్తుంది.  ఈ నేపథ్యంలో ఆ తరహాలో సినిమాలు చేయడానికి దర్శకులు సిద్ధమవుతున్నారు.


డ్రగ్స్ నేపథ్యంలో తెరకెక్కిన విక్రమ్ సినిమా ఇంతటి సంచలన విజయాన్ని అందుకుంటుందని ముందే ఊహించారు మేకర్స్. దర్శకుడు లోకేష్ అయితే ఈ సినిమా తప్పకుండా భారీ రికార్డులను సృష్టించే సినిమాగా ఉంటుందని భావించారు. దానికి తగ్గ కథ కథనం రూపొందించడం వల్లనే ఈ విధమైన రికార్డ్ సాధ్యమయింది. కమల్ హాసన్ లాంటి నటుడు ఈ సినిమాలో నటించడంతో ఏ ఒక్క మైనస్ కూడా లేకుండా పోయింది. ఆ విధంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించడం తో భారీగా వసూలు సాధించడంతో ఇప్పుడు సరికొత్త జోస్ వచ్చినట్లు అయింది .భవిష్యత్తులో ఈ తరహాలో సినిమాలు తెరకెక్కి కోలీవుడ్ సినిమా పరిశ్రమ యొక్క మార్కెట్ను మరింత విస్తరించాలని అక్కడి మేకర్స్ భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: