అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనక రాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతుంది అనే గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే ఈ కాంబో గురించిన వార్తలు ఎక్కువయ్యాయి. బన్నీ అభిమానులు కూడా వీరి కాంబినేషన్లో సినిమా వస్తే చాలా బాగుంటుంది అని ఈ వార్తలకు సపోర్ట్ చేస్తున్నారు. విక్రమ్ సినిమాతో సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న లోకేష్ తో సినిమాలు చేయాలని ప్రతి ఒక్క హీరో భావించడం సహజం.

అలా అల్లు అర్జున్ ఆయన తో సినిమా చేయాలని భావించినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే తన కోసం ఓ కథ రెడీ చేయమని కూడా అల్లు అర్జున్ చెప్పారట. దానికి లోకేష్ ఓ కథను రెడీ చేయగా ఆ చిత్రాన్ని త్వరలోనే తెరకెక్కించాలని ఇద్దరు భావించారని వార్తలు వినిపించాయి. కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తుంది. బన్నీ సన్నిహితుల ప్రకారం వీరి కాంబినేషన్ లో సినిమా అనేది ఇప్పటిదాకా ఓకే అవ్వలేదని అన్నారు. వాస్తవానికి వీరు కలుసుకోవడం కూడా జరగలేదని వారు చెప్పారు. 

ఈ నేపథ్యంలో ఇదంతా పుకారే అని స్పష్టం అయ్యింది. ఇంకొకవైపు అల్లు అర్జున్ పుష్ప రెండవ భాగం సినిమా పైనే పూర్తి దృష్టి పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తొలి  భాగం సంచలన విజయాన్ని అందుకోవడంతో ఆ అంచనాలను అందుకునే విధంగా రెండవ భాగం కూడా ఉండాలని ఆయన స్వయంగా స్క్రిప్ట్ పనుల్లో చేస్తున్నాడు అని అంటున్నారు. బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా నచ్చిన ఈ సినిమా యొక్క సీక్వెల్ కూడా వారికి బాగా నచ్చే విధంగా తీర్చిదిద్దాలని దర్శకుడు సుకుమార్ చాలా రోజుల నుంచి ఈ సినిమా యొక్క స్క్రిప్ట్ పనులను తీర్చిదిద్దుతున్నాడు. మరి ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తదుపరి చేయబోయే సినిమా గురించి ఎలాంటి క్లారిటీ లేదు కానీ ఈ సినిమా విడుదల తరువాత దాని గురించి ఆయన ఆలోచిస్తాడు అన్న స్పష్టత ఇప్పుడు వచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: