నయనతార ఇటీవలే వివాహం చేసుకొని తన పర్సనల్ లైఫ్ కు మూవ్ అయ్యింది. గత కొన్ని సంవత్సరాలుగా దర్శకుడు విజయ్తో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వివాహం చేసుకోవడం ఆమె అభిమానులను ఎంతగానో సంతోషపడుతుంది అంతకుముందు కొన్ని వ్యక్తిగత వివాదాలలో చిక్కుకున్న నయనతార ఆ తర్వాత ప్రొఫెషనల్గా నిలదొక్కుకొని ఇప్పుడు వ్యక్తిగతంగా కూడా సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదించడం అందరినీ సంతోషపరిచే విషయం.

అయితే పెళ్లి తర్వాత ఈమె సినిమాల్లో నటిస్తుందో లేదో అన్న ఆ అనుమానాలను ఆమె అభిమానులు వ్యక్తపరిచారు చాలావరకు హీరోయిన్లు పెళ్లి తర్వాత సినిమాలకు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించరు ఒకవేళ వారు ఆసక్తి చూపించిన కూడా హీరోయిన్గా చేయడానికి ఏమాత్రం మొగ్గుచూపారు వచ్చి ఆర్టిస్ట్ గా ఉంటారు ఆ విధంగా నయనతార ఇప్పుడు చేస్తున్న సినిమాలను పూర్తి చేస్తే భవిష్యత్తులో ఆమె హీరోయిన్ గా చేయదు అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. 

తాజాగా ఆమె సన్నిహిత వర్గాల నుంచి మరికొన్ని వార్తలు వినిపిస్తున్నాయి ఆమె సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంది అని వార్తలు చెబుతున్నారు. తాజాగా నయనతార ఓ2 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హాట్ స్టార్ లో వచ్చిన ఈ సినిమా  ఆక్సిజన్ కాన్సెప్ట్ తో రూపొందించారు. వాస్తవానికి నయనతారసినిమా చేయాల్సింది కాదు. ఆమె రేంజ్ కి ఈమె ఈ సినిమా చేయాల్సింది కాదు. కథ లో కూడా పెద్దగా అబ్బురపడే అంశాలు లేవు. కేవలం ఆమె పారితోషకం కోసమే ఈ సినిమా చేసినట్లు అనిపిస్తుంది.  ఆరేళ్ల బాబు కు తల్లిగా నయనతార ఈ సినిమాలో నటించింది. పాత్ర ఎలా ఉన్నా ఆమె ఓ మంచి సినిమా చేస్తే బాగుండేదని అందరు భావిస్తున్నారు. మరి ఇప్పటికైనా నయన తన సినిమాల విషయంలో జాగ్రతలు తీసుకుంటుందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: