తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా వరుస విజయాలు అందుకుంటూ రోజు రోజుకూ క్రేజ్ ను పెంచుకుంటూ పోతున్న హీరోలలో అడవి శేషు ఒకరు. క్షణం మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న అడవి శేషు ఆ తర్వాత గూడచారి , ఎవరు సినిమా లతో వరుస విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు.

ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న అడవి శేష్ తాజాగా మేజర్ సినిమాలో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ కీలక పాత్రలలో నటించగా ప్రకాష్ రాజు ఒక ముఖ్యమైన పాత్రలో నటించాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కిన మేజర్ సినిమా జూన్ 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది.

మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి వున్న మేజర్ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 18 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. 19 కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన మేజర్ సినిమా అతి తక్కువ రోజుల్లోనే 19 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసి క్లీన్ హిట్ గా నిలిచింది. 17 రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా మేజర్ సినిమా 31.90 కోట్ల షేర్ , 60.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 17 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యేసరికి మేజర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 12.90 కోట్ల లాభాలను అందుకుంది. ప్రస్తుతం కూడా మేజర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లంజ రాబడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: