యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో 30 వ సినిమా. ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించనుండగా,  రత్నవేలు ఈ మూవీ కి సినిమాటోగ్రాఫర్ గా పని చేయనున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం వరకు ఈ సినిమా షూటింగ్ జూన్ లో ప్రారంభం కాబోతుంది అంటూ అనేక వార్తలు బయటకు వచ్చాయి. కాకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో  తెరకెక్కబోయే  సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకా కొంచెం సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగష్టు నుండి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. అలా సినిమా సెట్స్ పైకి  వెళ్లడానికి ఆలస్యం కావడానికి ప్రధాన కారణం కొరటాల శివ సినిమాలో కొత్త లుక్ లో కనిపించడం కోసం ఎన్టీఆర్  ఏకంగా 8 నుంచి 9 కిలోల బరువు తగ్గి అదిరిపోయే లుక్ లో కనిపించడం కోసం కాస్త సమయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఆ కారణంతో ఈ సినిమా కాస్త ఆలస్యంగా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది.  ఇది ఇలా ఉంటే ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే తదుపరి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా తర్వాత కే జి ఎఫ్ మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: