తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం ఎందరో యువ హీరోలు తమ సత్తా చాటి ఎక్కువకాలం నిలదొక్కుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వారిలో ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీకి చెందిన అఖిల్ మరియు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ కొడుకు ఆకాష్ పూరీలు ఉన్నారు. ఆకాష్ పూరికి నటన కొత్తేమీ కాదు... తన చిన్న తనంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు వయసు వచ్చి హీరోగా మారక మాత్రం క్లిక్ కాలేకపోతున్నాడు. తన తండ్రి సపోర్ట్ తో హీరోగా ఆంధ్రా పోరీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా ఆశించిన మేరకు ఆకట్టుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలబడింది. 

అయితే ఆ తర్వాత అయినా హిట్ కొట్టాలని ఎంతో కసిగా  పూరి జగన్నాధ్ డైరెక్టర్ గా మరి మెహబూబా అనే సినిమా తీశాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. అయితే ఎందుకు హీరోగా ఫెయిల్ అవుతున్నాడు అని ఆలోచించుకుని ఎంతో కస్టపడి చేసిన సినిమా రొమాంటిక్. ఇది పాటలు, ట్రైలర్ అన్నీ బాగా ఆకట్టుకుని సినిమాపై అంచనాలను పెంచాయి. అయితే మళ్ళీ రివర్స్ కొట్టింది. దానితో ఇక ఆకాష్ పూరి ఇక హీరోగా నిలబడగలదా అన్న డౌట్ అందరిలోనూ కలిగింది. అయినా తగ్గేదేలే అన్నట్లుగా జార్జ్ రెడ్డి లాంటి హిట్ ను అందించిన డైరెక్టర్ జీవన్ రెడ్డి తో కలిసి చోర్ బజార్ అనే సినిమాలు నిర్మించారు.

ప్రస్తుతం పూరి ఫ్యామిలీ ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. ఈ సినిమా ఈ వారంలోనే విడుదల అవుతోంది. ఈ సినిమా మీద ఆకాష్ మరియు చిత్ర బృందం పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఇందులో ఆకాష్ సరసన గెహనా సిప్పి హీరోయిన్ గా నటించింది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. మరి టాలీవుడ్ పై ఆకాష్ చేస్తున్న దండయాత్ర ఈ సినిమాతో అయినా తీరుతుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: