ఇక టాలీవుడ్ లో ఉన్న మిడ్ రేంజ్ హీరోల్లో న్యాచురల్ నానికి ఉన్న క్రేజ్ గురించి అందరికీ కూడా తెలిసిందే. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆయన సినిమాలంటే చాలు ఎగబడి చూస్తారు. అందుకే దర్శకనిర్మాతలు ఆయనతో కలిసి సినిమాలు చేయడానికి చాలా ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఇక ఒక్కో సినిమాకి నాని తీసుకునే రెమ్యునరేషన్ కూడా చాలా ఎక్కువ. ఒకప్పుడు మొత్తం రూ.9 కోట్లు తీసుకునే నాని.. ఇప్పుడు ఏకంగా రూ.15 కోట్లు తీసుకుంటున్నారు. ఆయనకున్న క్రేజ్ కారణంగా నిర్మాతలు అడిగినంత పారితోషికం నో అనకుండా ఇస్తున్నారు.అసలు నిజం చెప్పాలంటే.. ఈ మధ్యకాలంలో నానికి  అయితే హిట్స్ పడడం లేదు. ఒక్క ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా మాత్రం మంచి సక్సెస్ అయింది. పైగా ఆయన సినిమాలకు నాన్-థియేట్రికల్ బిజినెస్ కూడా అసలు ఓ రేంజ్ లో జరుగుతుంది. అందుకే నాని కూడా తన రెమ్యునరేషన్ పైసా కూడా తగ్గించాలనుకోవడం లేదు. కానీ రాను రాను ఆయన సినిమాలకు థియేట్రికల్ మార్కెట్ మరింత తగ్గిపోతుంది.


జూన్ 10 వ తేదీన ఆయన నటించిన ‘అంటే సుందరానికీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికి ఈ సినిమా థియేట్రికల్ రన్ అయితే దాదాపు పూర్తయినట్లే అని సమాచారం తెలుస్తుంది.ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి ఈ సినిమా మొత్తం రూ.12 కోట్లు వసూలు చేసింది. అలాగే యూఎస్ మార్కెట్ లో మాత్రం నాని సినిమాకి మంచి కలెక్షన్స్ అనేవి వచ్చాయి. కానీ ఈ థియేట్రికల్ రెవెన్యూ నాని రెమ్యునరేషన్ కూడా కవర్ చేయలేదని సమాచారం తెలుస్తోంది. ఆయన సినిమాలు గనుక ఇలానే బాక్సాఫీస్ వద్ద ఆడితే ఇక నాని ఇమేజ్ పై చాలా ఎఫెక్ట్ పడడం ఖాయం. ఇప్పటికైనా నాని తన తన సినిమాలకొచ్చే రికవరీ బట్టి రెమ్యునరేషన్ అనేది ఫిక్స్ చేసుకుంటే నిర్మాతలకు కాస్తయినా భారం అనేది తగ్గుతుంది.ఇక నాని 'దసరా' అనే సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో తనను తాను నిరూపించుకోవాలని చూస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: