తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ మొదటి రెండు సినిమాలలో చూపించిన ప్రతిభ మూడవ సినిమాలో చూపించడంలో విఫలం అయ్యాడు. వరుసగా కొలమావు కోకిల మరియు డాక్టర్ చిత్రాలతో సక్సెస్ సాధించిన దిలీప్ కుమార్... మూడవ సినిమా విజయ్ తో చేసే అవకాశాన్ని కొట్టేశాడు. ఆ విధంగా తమిళ స్టార్ హీరో విజయ్ తో బీస్ట్ సినిమాను తెరకెక్కించాడు. ఇందులో విజయ్ సరసన పూజ హెగ్డే నటించింది. కానీ రొటీన్ కథనే ఎంచుకుని... దానికి తగిన స్క్రీన్ ప్లే ను రాసుకోవడం లో పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యాడు. అయితే ఈ సినిమా కన్నా ముందు గానే రజినీకాంత్ ఒక సినిమా ఇతనితో కమిట్ అయ్యాడు.

సినిమా పోస్టర్ నిన్న రిలీజ్ చేసింది చిత్ర బృందం. రజినీ కాంత్ మరియు డైరెక్టర్ దిలీప్ కుమార్ సినిమాకు టైటిల్ గా జైలర్ అని నిర్ణయించారు. ఈ సినిమా మీదనే ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. ఇందులో ప్రముఖ పాత్రలలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్, రమ్యకృష్ణ నటిస్తున్నారు. ఇక రజినీకాంత్ సరసన మరో సారి ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ నటిస్తోంది. ఇది అభిమానులకు నిజంగా ఒక పండుగ లాంటి వార్త అని చెప్పాలి. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇందులో ఒక బిజినెస్ మాన్ గా ఒక పాత్ర ఉందట. ఈ పాత్ర కోసం డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ప్రముఖ నటుడు ఆర్యను అడిగారట. ఇతను అయితే స్టైలిష్ గా ఉంటూ ఆ పాత్రకు సరిగా సూట్ అవుతాడని సెలెక్ట్ చేసుకున్నారట.

అయితే అందుకు ఈ విషయం గురించి ఇంకా ఆర్య ఎటువంటి సమాచారం చెప్పక పోవడం విశేషం. మరి ఈ వార్తలో ఎంత నిజం వుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే .



మరింత సమాచారం తెలుసుకోండి: