ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ప్రభాస్, యష్ లాగే పాన్ ఇండియా స్టార్‌గా మారి తన సత్తా చాటాడు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్‌కు కేవలం సౌత్ ఆడియన్స్ మాత్రమే కాదు, నార్త్ ప్రేక్షకులు కూడా పట్టం కట్టారు.ఇక దీంతో ఈ సినిమా బాలీవుడ్ జనాలకు కూడా చాలా పిచ్చపిచ్చగా నచ్చేసింది. ఇక రామ్ చరణ్ పాత్రకు అయితే వారు మరింత మెస్మరైజ్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ పాత్ర చరణ్‌కు మరోసారి బాలీవుడ్‌లో ఎంట్రీకి మార్గం సులువు చేసినట్లుగా సమాచారం తెలుస్తోంది.ఇక ఇప్పటికే ఒకసారి 'జంజీర్' అనే సినిమాతో బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న చరణ్, ఆ సినిమాతో అక్కడ దారుణమైన ఫెయిల్యూర్‌ను మూటగట్టుకున్నాడు. అయితే ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మూవీలో రామ్ చరణ్ నటించబోతున్నట్లుగా బీ-టౌన్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'గాడ్‌ఫాదర్' సినిమాలో ఓ కామియో పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.


ముందు నుండీ రామ్ చరణ్ అంటే సల్మాన్‌కు చాలా ఇష్టం. దీంతో ఈసారి కూడా తాను నటిస్తున్న 'కభీ ఈద్ కభీ దివాలీ' సినిమాలో ఓ కీలక పాత్రలో రామ్ చరణ్ నటించాల్సిందే అని సల్మాన్ కోరాడట.అయితే ఇక సల్మాన్ ఖాన్ కోరగానే చరణ్ కూడా ఓకే అనేసినట్లుగా బాలీవుడ్ మీడియా చెబుతోంది. ఇక ఈ సినిమాలో కేవలం కామియో పాత్రలో నటించడమే కాకుండా ఇంకా అలాగే ఓ మాస్ సాంగ్‌లో సల్మాన్‌తో కలిసి చరణ్ స్టెప్పులు కూడా వేస్తాడట. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో అనేది తెలియాలంటే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సిందే. ఇకపోతే, రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: