రామ్ చరణ్ ఇప్పుడు ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నాడు.. మొన్న వచ్చిన ఆచార్య సినిమా కాస్త నిరాశ పరిచినా కూడా ఇప్పుడు మాత్రం ఫుల్ జోష్ తో సినిమాలు చేస్తూ పోతున్నాడు.ఆర్ఆర్ఆర్'తో పాన్ ఇండియా స్టార్‌గా తన సత్తా చాటాడు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ పర్ఫార్మెన్స్‌కు కేవలం సౌత్ ఆడియెన్స్ మాత్రమే కాదు, నార్త్ ప్రేక్షకులకు కూడా పట్టం కట్టారు.ఈ సినిమా బాలీవుడ్ జనాలకు కూడా పిచ్చపిచ్చగా నచ్చేసింది. ఇక చరణ్ పాత్రకు వారు మరింత మెస్మరైజ్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ పాత్ర చరణ్‌కు మరోసారి బాలీవుడ్‌లో ఎంట్రీకి మార్గం సులువు చేసినట్లుగా తెలుస్తోంది.



 ఇప్పటికే ఒకసారి 'జంజీర్' అనే సినిమాతో బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న చరణ్, ఆ సినిమాతో దారుణమైన ఫెయిల్యూర్‌ను మూటగట్టుకున్నాడు. అయితే ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మూవీలో చరణ్ నటించబోతున్నట్లుగా బీ-టౌన్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'గాడ్‌ఫాదర్' సినిమాలో ఓ కేమియో పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ముందు నుండీ చరణ్ అంటే సల్మాన్‌కు చాలా ఇష్టం. దీంతో ఈసారి తాను నటిస్తున్న 'కభీ ఈద్ కభీ దివాలీ' సినిమాలో ఓ కీలక పాత్రలో చరణ్ నటించాల్సింది సల్మాన్ కోరాడట.


అయితే సల్మాన్ కోరికను చెర్రి కాదన లేక పోయాడని వార్తలు వినిపిస్తున్నాయి...సల్మాన్ కోరగానే చరణ్ కూడా ఓకే అనేసినట్లుగా బాలీవుడ్ మీడియా చెబుతోంది. ఇక ఈ సినిమాలో కేవలం కేమియో పాత్రలో నటించడమే కాకుండా, ఓ మాస్ సాంగ్‌లో సల్మాన్‌తో కలిసి చరణ్ స్టెప్పులు కూడా వేస్తాడట. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సిందే. ఇకపోతే, చరణ్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు..ఆసినిమా గురించి సోషల్ మీడియాలో ఎన్నో వదంతులు వచ్చిన విషయం తెలిసిందే..మరి ఆ సినిమా మెగా ఫ్యాన్స్ ఆలోచనలకు రీచ్ అవుతుందేమో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: