ఇటీవలే మెగా స్టార్ రామ్ చరణ్ నటించిన rrr చిత్రం మంచి విజయాన్ని అందుకుంది ఇక ఈ సినిమా అన్ని డైరెక్టర్ రాజమౌళి ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని. అయితే కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన ఆచార్య సినిమాలో రామ్ చరణ్ తన తండ్రితో కలిసి నటించారు కానీ ఈ సినిమా భారీ డిజాస్టర్ ను చవి చూసింది. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్లో ఓ సినిమా షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు ఇందులో రామ్ చరణ్ రెండు విభిన్నమైన పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సర్కారోడా అనే టైటిల్ని అధికారికంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తున్నది.


గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వినయ విధేయత రామ సినిమా విడుదల వరకు ఇది కూడా డిజాస్టర్ గా మిగిలింది అయితే ఇప్పుడు రామ్చరణ్ ఒక బాలీవుడ్ సినిమాలో నటించబోతున్నాడు అనే టాక్  బాగా వినిపిస్తోంది. రామ్ చరణ్ బాలీవుడ్ లో ఒక సినిమా సినిమా చేశారు. ఆ సినిమానే జంజీర్ కానీ ఈ సినిమా దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్ వైపు చూడలేదు రామ్ చరణ్.

అయితే ఇప్పుడు ఓ బాలీవుడ్ సినిమాలో నటించబోతున్నాడు అనే తాగు బాగా వైరల్ గా మారుతుంది అది కూడా సల్మాన్ ఖాన్ నటిస్తున్న "కభీ ఈద్ కభీ దివాలి"అనే సినిమాలో చరణ్ కీలకపాత్రలో నటించబోతున్నాడు గా తెలుస్తోంది ఇప్పటికే ఈ సినిమాలో వెంకటేష్ కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఇక హీరోయిన్గా పూజాహెగ్డే నటిస్తున్నది. ఇందులో పూజా హెగ్డే సోదరుడుగా వెంకీ కనిపించబోతున్నారు. అలాగే చరణ్ కూడా ఒక చిన్న పాత్రలో కనిపించబోతున్నాడని స్టాక్ బాగా వైరల్ గా మారుతోంది. ఇక చిరంజీవి సినిమా లో సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రలో నటించారు. మరి రామ్ చరణ్ సల్మాన్ ఖాన్ సినిమాలో నటిస్తాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: