టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో నిన్న మొన్నటి వరకు అగ్రకథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ ఈ ఏడాది ఏప్రిల్ 19వ తేదీన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి అందరికీ సంతోషాన్ని కలిగించింది.. కాజల్ అగర్వాల్ కొడుకుని చూడాలని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ఇప్పటి వరకు ఆమె కేవలం ఒక వైపు మాత్రమే ముఖాన్ని కనిపించకుండా ఫోటోలు షేర్ చేస్తూ వచ్చింది. కానీ ఈరోజు ప్రత్యేక సందర్భం గా తన కుమారుడితో దిగిన ఫోటోను ఆమె అభిమానుల కోసం పంచుకోవడం గమనార్హం. ఈ ఫోటో సోషల్ మాధ్యమాలలో చక్కర్లు కొడుతూ వస్తోంది.
ఇంకా కాజల్ అగర్వాల్ తన కొడుకుకి జన్మనిచ్చిన తర్వాత మాతృత్వాన్ని బాగా ఆస్వాదిస్తూ కుమారుడే లోకం గా జీవిస్తుంది. అంతేకాదు తన కొడుకు కు సంబంధించిన ఫోటోలను కూడా ఇటీవల రోజుకొకటి చేస్తూ ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది.. ఇకపోతే అందాల చందమామ కాజల్ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో తేజ డైరెక్షన్లో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ సినీ ఇండస్ట్రీలోకి వచ్చే 16 సంవత్సరాల అవుతున్నప్పటికీ అదే జోరు చూపిస్తూ ఉండటం గమనార్హం. పెళ్లయిన తర్వాత కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది కాజల్ అగర్వాల్.

ఇక ఈ క్రమంలోనే కుర్ర హీరోలతో పాటు సీనియర్ హీరోలతో కూడా నటించి మెప్పించింది.అందుకే కాజల్ అగర్వాల్ కు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉండడం గమనార్హం. ఇక అంతే కాదు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. కాబట్టే ఆస్తులు కూడా బాగా కూడబెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఇతర ఆస్తులు , కార్లు,  వ్యాపారాలు ఇలా అన్ని కలిపి సుమారుగా 100 కోట్లకు పైగా ఈమె  దగ్గర ఆస్తులు ఉన్నట్లు సమాచారం. ఇక మొత్తానికి అయితే ఇటీవల తన కొడుకు ఫోటో షేర్ చేసి ఎమోషనల్ అయ్యింది కాజల్ అగర్వాల్.

మరింత సమాచారం తెలుసుకోండి: