బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన షో బిగ్ బాస్ .అయితే ఈ షో  గురించి చాలామంది విమర్శలు చేసారు. కానీ  ఈ షోను అభిమానించే అభిమానులు కూడా చాలామంది ఉన్నారు.ఇదిలావుండగా ప్రస్తుతం  స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే బిగ్ బాస్6 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే సంగతి తెలిసిందే.ఇకపోతే బిగ్ బాస్ సీజన్6 కు కూడా నాగార్జున హోస్ట్ గా మెప్పించనున్నారు.ఇక ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ నెట్టింట కొన్ని పేర్లు వైరల్ అవుతున్నాయి.ఇదిలావుండగా యంగ్ జనరేషన్ స్టార్ హీరోలు ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించడానికి ఆసక్తి చూపకపోవడం, సీనియర్ హీరోలకు ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించాలనే ఆసక్తి లేకపోవడంతో బిగ్ బాస్ నిర్వాహకులకు నాగార్జున మాత్రమే ఆప్షన్ గా మిగిలారు.

అయితే  నాగార్జున హోస్ట్ గా మెప్పిస్తూ ఉండటంతో పాటు ఎలాంటి సమస్య వచ్చినా తన అనుభవంతో సులభంగా ఆ సమస్యను పరిష్కరిస్తూ కెరీర్ విషయంలో ముందడుగులు వేస్తున్నారు.ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని పేర్లు తెగ  వైరల్ అవుతున్నాయి.ఇక వారెవరంటే....నటి నవ్యాస్వామి, ఆది, చిత్రారాయ్, యాంకర్ ధన్షు, దీపికా పిల్లి, వర్షిణి పేర్లు బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా వినిపిస్తున్నాయి.కాగా  ఈ సెలబ్రిటీలలో ఎవరెవరు ఫైనల్ అవుతారో త్వరలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.

ఇదిలావుంటే మరోవైపు బిగ్ బాస్ షోకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.అయితే బుల్లితెరపై మంచి రేటింగ్ లను సొంతం చేసుకుంటున్న షోలలో ఈ షో ఒకటని చెప్పవచ్చు.ప్రస్తుతం వైరల్ అవుతున్న పేర్లలో ఎంతమంది సెలబ్రిటీలు తుది జాబితాలో ఉంటారో తెలియాల్సి ఉంది. కాగా బిగ్ బాస్ షోకు రోజురోజుకు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.ఇకపోతే బిగ్ బాస్ షో ద్వారా ఈ షో నిర్వాహకులకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలు వచ్చాయని సమాచారం అందుతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: