భారీ అంచనాలతో ఈ ఏడాది విడుదలైన విరాటపర్వం సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదనే విషయం తెలిసిందే. రానా, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించగా వేణు ఊడుగుల డైరెక్టర్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయట.


క్రిటిక్స్ ఈ సినిమా గురించి పాజిటివ్ గా రివ్యూలు ఇవ్వడంతో ఈ సినిమా సంచలన విజయం సాధించడం గ్యారంటీ అని ఫ్యాన్స్ సైతం ఫిక్స్ అయ్యారట . అయితే విరాటపర్వం ఫ్లాప్ కావడానికి గల కారణాలను అన్వేషిస్తే మాత్రం నక్సలిజం బ్యాక్ డ్రాప్ ను ఎంచుకోవడమేనని ఈ సినిమా ప్లాప్ కావడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.


20 సంవత్సరాల క్రితం నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలు సక్సెస్ సాధించినా అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులలో చాలా మార్పులు వచ్చాయనే సవిషయం తెలిసిందే. ఏప్రిల్ లో విడుదలైన ఆచార్య సినిమా ఫ్లాప్ కావడానికి కూడా ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ కారణమనే విషయం తెలిసిందే. ఈ కాలం యూత్ కు నక్సలైట్ల గురించి నక్సలిజం గురించి అస్సలు తెలియదు. ఔట్ డేటెడ్ కాన్సెప్ట్ అయిన ఈ కాన్సెప్ట్ తో సినిమాలను తెరకెక్కిస్తే రాబోయే రోజుల్లో కూడా ఈ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలు ఇదే ఫలితాన్ని అందుకుంటాయ ని చెప్పడంలో సందేహం అయితే లేదు.


 


మరోవైపు రానా, సాయిపల్లవి కెరీర్ లపై ఈ సినిమా రిజల్ట్ ఎంతమేర ప్రభావం చూపుతుందో చూడాలి మరి.రానా తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కమర్షియల్ కథల కు రానా ప్రాధాన్యతనివ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రానా సైతం విరాటపర్వం ఇంటర్వ్యూలలో ఫ్యాన్స్ కామెంట్లను పట్టించుకుంటానని ఫ్యాన్స్ చెప్పిన విధంగా చేస్తానని అన్నారట.. రానా కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. రానా తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను అందుకుంటా రో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: