కొన్ని సినిమాలు సైలెంట్ గా వచ్చి సంచలనాలు సృష్టిస్తుంటాయి. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదల అయిన కొన్ని చిత్రాలు అనూహ్యంగా గొప్ప విజయాల్ని అందుకుని బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంటాయి. ఇలా చాలా చిత్రాలు సైలెంట్ గా వచ్చి రికార్డ్ క్రియేట్ చేసిన దాఖలాలు ఎన్నో.  కంటెంట్ ఉండాలే కాని ప్రేక్షకులు ఫిదా అయ్యి సక్సెస్ అందిస్తారు అనడంలో సందేహం లేదు. ఇపుడు అదే తరహా లో మరో చిన్న సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి పెద్ద సక్సెస్ ను  అందుకుంది.  అదే "777 ఛార్లీ"... ఈ సినిమా విడుదల అయిన పది రోజులకే ప్రపంచ వ్యాప్తంగా 60 కోట్ల గ్రాస్ దాటేసి ఆశ్చర్యపరుస్తోంది .

తెలుగులో అంతే జోష్ చూపిస్తోంది అనలేము... కానీ  విక్రమ్ వంటి సీనియర్ స్టార్ హీరో పోటీని తట్టుకుని నిలబడి డీసెంట్ కలెక్షన్లు అందుకుని సత్తా చాటుతోంది.  డాగ్ డ్రామా గా మన ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంటూ హౌస్ఫుల్ బోర్డ్ పెట్టిస్తోంది.  రాష్ట్రాల వారీగా చూస్తే  కర్ణాటకలో 45 కోట్లు, తమిళనాడులో 2 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల 90 లక్షలు రాబట్టిన 777 ఛార్లీ,  కేరళలో ఏకంగా 3 కోట్ల మార్క్ ని దాటి ఔరా అనిపిస్తోంది.  ఇక పోను పోను గ్రాస్ మరింత పెరుగుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒక చిన్న సినిమా ఈ రేంజ్ లో రిలీజ్ అయిన పది రోజులకే కలెక్షన్లు భారీగా రాబడుతోంది అంటే పెద్ద విశేషమే .

ఇందులో కన్నడ నటుడు రక్షిత్ శెట్టి హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు కిరణ్ రాజ్ కె దర్శకత్వం వహించాడు. మరికొన్ని పాత్రలలో బాబీ సింహ, సంగీత శృంగేరి లు నటించి మెప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: