అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా తెలుగు లో తాజాగా  గోపీచంద్ హీరోగా తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమాలో నటించింది.ఇక విడుదలకు సిద్ధం అయిన పక్కా కమర్షియల్ సినిమా ప్రమోషన్ లో భాగంగా రాశి ఖన్నా మీడియాతో ముచ్చటించింది. ఆ సందర్బంగా పలు ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా ఆమె చెప్పుకొచ్చింది. ముఖ్యంగా టాలీవుడ్ లో తన కెరీర్ ఇంకా అలాగే తన డ్రీమ్ రోల్స్ ప్రాజెక్ట్స్ గురించి కూడా చెప్పుకొచ్చింది. ఆ సమయంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు పై తనకు ఉన్న ఇంట్రెస్ట్ ను చెప్పింది.ఇక టాలీవుడ్ హీరోల్లో ఏ హీరోతో మీరు సినిమాను చేయాలని కోరుకుంటున్నారు అన్నట్లుగా ప్రశ్నించిన సమయంలో ఆమె తనకు సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే చాలా ఇష్టం.ఇక ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని కోరుకుంటున్నాను అన్నట్లుగా సమాధానం ఇచ్చింది. మహేష్ బాబుతో సినిమా ఛాన్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్లుగా ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.


సూపర్ స్టార్ మహేష్ బాబు తో రాశిఖన్నా మాత్రమే కాదు బాలీవుడ్ ముద్దుగుమ్మలు కూడా సినిమాలు చేయాలని ఆశ పడుతున్నామని గతంలో పలు సందర్బాల్లో వ్యాఖ్యలు చేసిన విషయం కూడా తెల్సిందే. తాజాగా రాశి ఖన్నా కూడా ఆ జాబితాలో చేరింది. అయితే మహేష్ బాబుతో నటించే అవకాశం రావడం అంటే అది చాలా పెద్ద విషయం.చూడాలి మరి ఫ్యూచర్ లో మహేష్ తో నటించే ఛాన్స్ రాశి ఖన్నాకి దక్కుతుందో లేదో.ఇక పక్కా కమర్షియల్ సినిమా తో టాలీవుడ్ లో మరింతగా స్థానం పదిలం చేసుకోవడం కోసం రాశి ఖన్నా సిద్ధం అయ్యింది. కామెడీ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ను బన్నీ వాసు నిర్మించాడు. అల్లు అరవింద్ సమర్పిస్తున్న పక్కా కమర్షియల్ సినిమా టైటిల్ కు తగ్గట్లుగా ఖచ్చితంగా మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఉంటుందనే నమ్మకంను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: