టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతతో విడాకుల అనంతరం అక్కినేని నాగచైతన్య మరో హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పలు పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే.తెలుగమ్మాయి వైజాగ్ కి చెందిన ప్రముఖ మోడల్ 'గూఢచారి' ఫేమ్ శోభిత ధూళిపాళతో చైతూ డేటింగ్ చేస్తున్నాడంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు రావడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇక అంతర్గత నివేదికల ప్రకారం ఈ డేటింగ్ రూమర్స్ నిజం కాదని సమాచారం తెలుస్తోంది.ఇక బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం 'మేజర్' ప్రమోషన్ల సమయంలో శోభిత ను కలిసేందుకు ఆమె బస చేసిన హోటల్ కు నాగ చైతన్య చాలాసార్లు కూడా వెళ్లాడట. అలానే హైదరాబాద్ లోని చై కొత్త ఇంట్లో ఇద్దరూ కూడా కనిపించారని.. ఒకే కారులో బయటకు కూడా వెళ్లారని పేర్కొన్నారు. అయితే ఈ పుకార్లు అన్నీ కూడా నిరాధారమైనవని తెలుస్తోంది.నాగ చైతన్య లేదా శోభిత ఇంకా డేటింగ్ పుకార్లను ఖండించనప్పటికీ అవన్నీ కూడా ఒట్టి గాలి వార్తలే అని.. ఇద్దరూ కూడా చాలా మంచి స్నేహితులు మాత్రమే అని ఇన్ సైడ్ వర్గాలు వెల్లడించాయి.


'గూడాచారి' సినిమా తర్వాత శోభిత అక్కినేని ఫ్యామిలీతో సన్నిహిత బంధాన్ని కలిగి ఉందని.. ఆ క్రమంలో నాగ చైతన్యతో పరిచయం కూడా ఇందులో భాగమని అంటున్నారు. అంతేకానీ ఇప్పుడు వినిపిస్తున్న డేటింగ్ వార్తలు అసలు ఏమాత్రం కూడా నిజం కాదని చెబుతున్నారు.ఇక ఈ డేటింగ్ రూమర్లు అనేవి నటీనటులకు సినీ పరిశ్రమకు అసలు కొత్తేమీ కాదు. సమంతతో విడాకుల తరువాత చైతూ విషయంలోనే ఇప్పటికే ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల పేర్లు కూడా వినిపించాయి. సమంతతో కొన్నేళ్ళు డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్న చైతూ 4 ఏళ్ళు కాపురం చేశాడు. ఇక వీరిద్దరూ విడాకులు తీసుకోవడంతో చైతన్య పై ఇప్పుడు మళ్లీ డేటింగ్ రూమర్స్ పుట్టుకొచ్చాయి. కానీ అవి నిజం కాదని సమాచారం తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: