గోపీచంద్‌ కథల ఎంపికలో మాత్రం ఏదో తేడా కొడుతోంది. అందుకే వరుస ఫ్లాప్‌లు వస్తున్నాయి అని ఎవరైనా ఈజీగా చెప్పేస్తారు. మధ్యలో ఒకటో రెండో సినిమాలు బాగున్నాయని టాక్‌ వచ్చినా కూడా ఫ్లాప్‌ల వరద మధ్యలో అవి కూడా సరైన విజయం అందివ్వలేకపోతున్నాయి.


ఇలాంటి సమయంలో కూడా గోపీచంద్ బాగా జడ్జి చేసి ఓ సినిమా చేయకుండా వదిలేశాడు అని అంటే నమ్ముతారా. కానీ ఇది జరిగిందట.. ఇప్పుడు చెబుతున్న రానా - సాయిపల్లవి 'విరాటపర్వం' గురించేనట.


'విరాటపర్వం' కథను తొలుత వేణు ఉడుగుల గోపీచంద్‌కే చెప్పారట. కథ విని అంతా బాగున్నా. సినిమా అంతా హీరోయిన్‌ మీదే నడుస్తుందని, చేసే హీరోకు పేరు రాదని అన్నాడట గోపీచంద్‌. ఇప్పుడు 'విరాటపర్వం' పరిస్థితి కూడా చూస్తే అలానే ఉంది. సినిమాలో నటించిన సాయిపల్లవికి మంచి పేరొచ్చింది. అయినా ఆమెకు ఇప్పుడు ప్రత్యేకంగా పేరొచ్చేది ఏమీ లేదు. ఆల్‌రెడీ సూపర్‌ యాక్ట్రెస్‌ అనే పేరు అయితే ఉంది. మరోవైపు సినిమా ఫలితం కూడా తేడా కొట్టేసింది.


 


ఈ మొత్తం లెక్కల ప్రకారం గోపీచంద్‌ మరో ఫ్లాప్‌ నుండి తప్పించుకున్నాడు అని అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. నిజానికి గోపీచంద్‌కి కథ చెప్పి ఒప్పించడం చాలా కష్టమంటుంటారు అందరూ.. అతను చేసిన సినిమాలన్నీ హిట్ అవ్వకపోవొచ్చు. కానీ.. వదులుకున్న సినిమాలు మాత్రం హిట్ అయిన దాఖలాలు లేవు అంటుంటారు. ఇప్పుడు 'విరాట పర్వం' సినిమాతో ఆ మాట మరోసారి మరోసారి రుజువైందట.. ఇక గోపీచంద్‌ సినిమాల గురించి చూస్తే.


 


మారుతి డైరక్షన్‌లో ఆయన నటించిన 'పక్కా కమర్షియల్‌' వచ్చే నెల ఒకటో తేదీ విడుదల కాబోతోందట. రాశీ ఖన్నా కథానాయికగా నటిస్తున్న ఈ కోర్టు డ్రామా సినిమాలో సత్యరాజ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. సినిమా టీజర్‌ ఇంట్రెస్టింగ్‌గా అనిపించినా, ట్రైలర్‌ మాత్రం నిరాశపరిచిందట. మరి సినిమా ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. ఈ సినిమా ఎప్పుడో పూర్తయినా కరోనా పరిస్థితుల, పెద్ద సినిమా దండయాత్ర వల్ల ఇన్నాళ్లూ ఆగిపోయిందట. ఇప్పుడు రిలీజ్‌ చేస్తున్నారని తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: