టాలీవుడ్ టాప్ డైరెక్టర్ దర్శకధీరుడు జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొంది ఇటీవలే విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ సినిమా హడావుడి హాలీవుడ్ లో ఇంకా కొనసాగుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా కూడా అత్యధిక వసూళ్లను దక్కించుకుని రికార్డులు బ్రేక్ చేసిన ఆ సినిమా తర్వాత జక్కన్న కాస్త గ్యాప్ తీసుకుని మళ్లీ ఇప్పుడు తదుపరి సినిమా అయిన సూపర్ స్టార్ మహేష్ సినిమా వర్క్ లో పడ్డట్లుగా సమాచారం అందుతోంది.రాజమౌళి సినిమా మహేష్ బాబుతో ఎప్పుడో కన్ఫర్మ్ అయిన విషయం తెల్సిందే.అయితే గత కొన్నాళ్లుగా మహేష్ బాబుతో రాజమౌళి సినిమా గురించిన వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వస్తున్నాయి. ఎట్టకేలకు వీరి కాంబో మూవీ ఇప్పుడు పట్టాలెక్కుతోంది. రాజమౌళి ప్రస్తుతం తన తండ్రి రైటర్ విజయేంద్ర ప్రసాద్ తో కలిసి స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టారట. రాజమౌళి దాదాపు అన్ని సినిమాలకు కూడా ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ ను అందిస్తున్నారు.ఇక ఈ సినిమాకు కూడా ఆయనే రచయితగా వ్యవహరించబోతున్నాడు.యస్ యస్ రాజమౌళి ఇప్పటికే ఒక స్టోరీ లైన్ ను అనుకున్నాడని..ఇక దాన్ని అద్భుతమైన కథ గా మార్చే పనిలో ఉన్నారు. ఆ తర్వాత పూర్తి స్థాయి స్క్రిప్ట్ గా కూడా మార్చుతారు. యస్ యస్ రాజమౌళి తన హీరోలు ఎవరికి అయినా స్క్రిప్ట్ పూర్తిగా చెప్పడు అనే టాక్ ఉంది. మరి మహేష్ బాబుకు అయినా రాజమౌళి పూర్తి కథను చెప్పబోతున్నాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.


ప్రస్తుతానికి ఈ సినిమా గురించి స్క్రిప్ట్ వర్క్ కూడా షురూ చేశారు. దీనికి స్టోరీ లైన్ రెడీ అయ్యింది అనే అప్డేట్ మాత్రమే అందుతోంది. ఇక త్వరలోనే మరిన్ని అప్డేట్స్ రాజమౌళి టీమ్ నుండి వస్తాయేమో చూడాలి. జక్కన్న రాజమౌళి ఈ సినిమాను వచ్చే ఏడాది ఆరంభంలో పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అనేది అందుతోంది.ఇక ఈ సినిమాను భారీ యాక్షన్ అడ్వంచర్ మూవీగా దాదాపుగా 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించేందుకు గాను పాన్ వరల్డ్ రేంజిలో ప్లాన్ చేస్తున్నాడట. ఈ బడ్జెట్ షూటింగ్ మొదలు అయ్యి అది పూర్తి అయ్యేప్పటికి పెరిగినా ఆశ్చర్యం లేదు. జక్కన్న 500 కోట్లు కాదు ఇంకా వెయ్యి కోట్లు పెట్టినా వెనక్కు తీసుకు రాగల ధీరుడు అనే అభిప్రాయం ప్రతి ఒక్క నిర్మాతకు కూడా ఉంటుంది. అందుకే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కు ఆ భారీ బడ్జెట్ రిస్క్ ఏమీ కాదు.సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక సూపర్ అడ్వంచర్ మూవీని తెరకెక్కించేందుకు రాజమౌళి స్క్రిప్ట్ రెడీ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అదే తరహా కథను ఇప్పుడు తండ్రి విజయేంద్ర ప్రసాద్ రెడీ చేసే పనిలో ఉన్నాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అభిమానులు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా అధికారిక ప్రకటన కోసం ప్రపంచంలో వున్న లక్షలాది మహేష్ ఫ్యాన్స్ అంతా కూడా వెయిట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: