తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదట మంచి నటిగా గుర్తింపు పొంది ఆ తర్వాత ఎంతోమంది కనుమరుగైన హీరోయిన్లు చాలామందే ఉన్నారు. ఇప్పుడు తాజాగా అలాంటి వారి లిస్టు లోకి చేరే కి దగ్గరలో ఉంది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. తన కెరియర్ మొదట్లో మంచి మంచి చిత్రాల్లో నటించి పేరు పొందిన ఈ ముద్దుగుమ్మ దాదాపుగా ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక సినిమాలో నటిస్తుంది. ఆ చిత్రమే హ్యాపీ బర్తడే.. మరి ఈ చిత్రం గురించి ఒక వీడియో ప్రోమో వైరల్ గా మారుతుంది వాటి గురించి చూద్దాం.


మత్తు వదలరా అనే సినిమా ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు డైరెక్టర్ రితేష్ రానా. ఇక ఈయన తెరకెక్కించబోతున్న తాజా చిత్రం హ్యాపీ బర్తడే. ఈ సినిమాలో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి నటిస్తున్నది. ఈ చిత్రాన్ని క్లబ్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ,ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మేకర్స్ కలిసి నిర్మిస్తున్నారు. నవీన్ ఎర్నేని, మల్ల మంచిలి, చిరంజీవి, హేమలత తదితరులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలో వెన్నెల కిషోర్, గుండు సుదర్శన్, సత్యవతి వారు ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం జూలై 15 న ప్రపంచ వ్యాప్తం గా విడుదల కాబోతుంది.


కాగా ఇప్పటికే ఈ సినిమా టీజర్ బాగా ఆకట్టుకున్నది. ఇక ఇటీవలే ఈ సినిమాలోని పాత్రలను ఇంట్రడ్యూస్ చేస్తూ ప్రచార చిత్రాలను విడుదల చేసి ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించారు. ఇక తాజాగా నిన్నటి రోజున లావణ్య త్రిపాఠి పాత్రకు సంబంధించి ఒక ప్రోమో విడుదల చేయడం జరిగింది చిత్రబృందం. ఈ చిత్రంలో హ్యాపీ 340 లావణ్య త్రిపాఠి కనిపించబోతోంది. ఈమె పాత్ర ఎవరూ ఊహించని విధంగా ఉండడమే కాకుండా పూర్తి వినోదాన్ని అందించబోతున్నారు అనే చిత్రబృందం తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: