దసరా వరకు టాప్ హీరోల జాతర లేకపోవడంతో అప్పటివరకు చిన్న మీడియం రేంజ్ సినిమాలకు స్పేస్ దొరికింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఒకేసారి వారానికి 5 నుంచి 10 సినిమాలు ఇలా దసరా వరకు విడుదలయ్యే పరిస్థితులు ఏర్పడటంతో ఏధైర్యంతో ఇన్ని చిన్న మీడియం రేంజ్ సినిమాలు క్యూ కడుతున్నాయి అన్న విషయానికి అర్థం తెలియక చాలామంది ఆశ్చర్య పడుతున్నారు.


ఈవారం కూడ చాల చిన్న సినిమాల తాకిడి ఉంది. దీనికితోడు ఈ చిన్న సినిమాల హీరోలు హీరోయిన్స్ పేర్లు కూడ తెలియని పరిస్థితి ఈ చిన్న సినిమాలు అన్నీ విపరీతంగా పెరిగిపోయిన ఓటీటీ సంస్థలను నమ్ముకుని విడుదల అవుతున్నాయి. అయితే ఓటీటీ సంస్థలు గతంలో చిన్న సినిమాల విషయంలో ఎదురైన అనుభవాల రీత్యా ఒక స్పెషల్ క్రిటిక్ టీమ్ ను ఏర్పాటు చేసుకుని వారి వివరాలు బయటికి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటూ విడుదలైన చిన్న సినిమాలలో నిజంగా ఏచిన్న సినిమా రియల్ గా బాగుండి అన్న ఫీడ్ బ్యాక్ తమ టీమ్ ద్వారా తెప్పించుకుని ఆతరువాత మాత్రమే చిన్న సినిమాలను కొనే విషయంలో ఓటీటీ సంస్థలు నిర్ణయం తీసుకున్నట్లు లీకులు వస్తున్నాయి.


గతంలో లా వేలంవెర్రిగా ప్రతి చిన్న సినిమాను కొనే ఆలోచన ఓటీటీ సంస్థలకు లేదు అన్నవిషయాన్ని గ్రహించిన చిన్న సినిమా నిర్మాతలు తమ చిన్న సినిమాలకు కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి భారీ పబ్లిసిటీ చేసుకోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే మరికొన్ని చిన్న సినిమా నిర్మాతలతో ఓటీటీ సంస్థలు మరొక విధంగా బేరసారాలు ఆడుతున్నట్లు టాక్.


తాము కొన్న చిన్న సినిమాలకు సంబంధించిన ఎగ్రిమెంట్ ఎమౌంట్ లో కొంత భాగం మాత్రమే ముందుగా ఇచ్చి ఆమిగిలిన ఎమౌంట్ ను ఆసినిమాకు వచ్చిన హిట్స్ బట్టి ఇచ్చే కొత్త సాంప్రదాయాన్ని కూడ తెర లేపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈవార్తలే నిజం అయితే చిన్న సినిమాల నిర్మాతలు ఓటీటీ సంస్థల దయాదాక్షిణ్యం మీద ఆధారపడవలసిన పరిస్థితులు ఏర్పడతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: