టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి సినిమా పై విపరీతమైన అభిమానంతో ఎందరో నిర్మాతలు ప్రతి సంవత్సరం ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతూనే ఉన్నారు. అయితే అలా ఎంటర్ అయిన నిర్మాతలలో కేవలం 10శాతం మంది మాత్రమే విజయాలు అందుకుంటూ ఉంటే  మిగతా 90 శాతం మంది పరాజయాల బాట పట్టడంతో కోట్లాది రూపాయలలో నష్టాలు కోరి తెచ్చుకుంటున్నారు.


ఈనాటి తరం అభిరుచులు మారిపోవడంతో ఏసినిమా సగటు ప్రేక్షకుడుకి నచ్చుతుందో లేదో తెలియని పరిస్థితి. దీనితో మంచి సినిమాలు తీయాలి అని ఆరాటపడే నిర్మాతలకు తీవ్ర పరాజయాలు వెంటాడుతున్నాయి. ఇప్పుడు ఆ లిస్టులోకి నిర్మాత సుధాకర్ చెరుకూరి చేరడం చాలామంది ఇండస్ట్రీ ప్రముఖులకు బాధ కలిగిస్తోంది. అమెరికాలో ఉన్నత చదువులు చదువుకుని ఇండియా వచ్చిన తరువాత మంచి సినిమాలు తీయడానికి సొంతంగా శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా బ్యానర్ ను పెట్టి మంచి సినిమాలు తీస్తున్నాడు.


శర్వానంద్ సాయి పల్లవి లతో తీసిన ‘పడి పడి లేచె మనసు’ మూవీ డిఫరెంట్ కథతో వచ్చినప్పటికీ ఆసినిమా ఫెయిల్ అయింది. తిరిగి మళ్ళీ శర్వానంద్ తోనే ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ మూవీ తీసిన పరిస్థితులలో ఆమూవీ కూడ భయంకరమైన ఫ్లాప్ గా మారింది. లేటెస్ట్ గా తీసిన ‘విరాటపర్వం’ మూవీ బడ్జెట్ 15 కోట్లు దాటడంతో ఆమూవీ పెట్టుబడిలో కనీసం 40 శాతం కూడ తిరిగిరావడం కష్టం అన్నమాటలు వినిపిస్తున్నాయి.


ఇలా వరస పరాజయాలు ఎదురౌతున్నప్పటికీ ఈనిర్మాత తన విశ్వాసం కోల్పోకుండా నానితో ‘దసరా’ మూవీని తీస్తున్నాడు. ఈమూవీకి నాని మార్కెట్ మించి ఖర్చు పెడుతున్నారు అన్న టాక్ ఉంది. అదేవిధంగా రవితేజాతో ‘రామారావు ఆన్ డ్యూటీ’ అన్న మూవీ కూడ ఈనిర్మాణ సంస్థ నుండి వస్తోంది. అయితే ఈ రెండు మూవీలపై కూడ నెగిటివ్ టాక్ ఇండస్ట్రీలో ప్రచారంలోకి వస్తున్న నేపధ్యంలో మంచి అభిరుచిగల ఈ నిర్మాతకు ఇలాంటి సమస్యలు ఎందుకు వచ్చాయి అంటూ కొంతమంది బాధపడుతున్నట్లు టాక్..



మరింత సమాచారం తెలుసుకోండి: