అలా మారుతి స్టేట్మెంట్ ఇవ్వడంతో ప్రభాస్ , మారుతి కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ కి రాజా డీలక్స్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ లో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్ లు నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని మారుతి హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కించనున్నట్లు, అందు కోసం ఇప్పటికే ప్రత్యేకంగా ఒక భారీ సెట్ ను కూడా చేయించడానికి చిత్ర బృందం డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. అలాగే ఆ ప్రత్యేక సెట్ లోనే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించి ఒక ఆసక్తికరమైన న్యూస్ వైరల్ అవుతుంది.
అసలు విషయం లోకి వెళితే... ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న రాజా డీలక్స్ సినిమా షూటింగ్ వచ్చే సంవత్సరం సమ్మర్ తర్వాత మొదలు కానున్నట్లు, ఆ తర్వాత సినిమా షూటింగ్ ను శర వేగంగా పూర్తి చేసి 2024 సంక్రాంతి కానుకగా ఈ మూవీ ని విడుదల చేయాలని చిత్ర బృందం ప్రణాళికలు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో తెరకెక్కబోయే రాజా డీలక్స్ మూవీ కోసం ఇంకా చాలా కాలం వేచి చూడవలసి ఉంది.