జూన్ 22న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు   అన్న సంగతి తెలిసిందే.కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఫ్యాన్ బేస్ మామూలుగా ఉండదు . అయితే మొట్టమొదటిసారిగా ఈయన తెలుగులో సినిమా నటిస్తున్నందుకు ప్రేక్షకులు మరియు ఈయన అభిమానులు సైతం ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈయన పుట్టిన రోజు ఈ సందర్భంగా గాన   అతను తెలుగులో నటిస్తున్న స్ట్రైట్ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.ఇకపోతే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 'శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌' ...

బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్, 'పీవీపీ' బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇక  ఈ చిత్రానికి 'వారసుడు' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.అయితే ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని … అందుకే 'వారసుడు' అనే టైటిల్‌ ఈ కథకి కరెక్ట్ గా సరిపోతుంది అని చిత్ర బృందం వెల్లడించింది. కాగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్ సూటు బూటు వేసుకుని స్టైల్ గా కనిపిస్తున్నాడు.ఇక ' ది బాస్ రిటర్న్స్' అనేది ఈ చిత్రానికి ట్యాగ్ లైన్.అయితే  అంతా బాగానే ఉంది కానీ టైటిల్ ను బట్టి… క్యాప్షన్ ను బట్టి… చిత్ర బృందం వెల్లడించిన దానిని బట్టి..

ఈ చిత్రంలో రెండు సూపర్ హిట్ సినిమాల పోలికలు ఉంటాయని స్పష్టమవుతుంది.అయితే  ఈ చిత్రం కథ ఎన్టీఆర్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ 'బృందావనం', అలాగే రజినీకాంత్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ 'అరుణాచలం' పోలికలు కనిపిస్తాయని అందరూ అంటున్నారు.కాగా  విజయ్ ఓ ఇంటికి కొన్ని కారణాలు వలన ఆతిథిగా వెళ్లడం…పోతే అక్కడ చుట్టూ ఉన్న జనాలను,మరియు అక్కడి పరిసరాలను చక్కదిద్ది అసలైన వారసుడు అని తెలుసుకుని అక్కడే సెటిల్ అయిపోవడం.అయితే తాజా సమాచారం ప్రకారం  ఇలా ఉంటుంది కథ అని తెలుస్తుంది. ఇక దిల్ రాజు రెగ్యులర్ సినిమా ఫార్మేట్ లానే ఈ మూవీ కూడా ఉంటుంది అని బయట నుండి వినికిడి.అయితే  మరి అది ఎంత వరకు నిజమో కాదో లేక లేక ఇదంతా అబద్దమా అని తెలియాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: