ఇండియన్ క్రికెట్‌లో మహేంద్ర సింగ్ ధోనీ గురించి మనకి తెలియంది కాదు.అయితే ఇండియన్ క్రికెట్‌లో మహేంద్ర సింగ్ ధోనీని అందరూ 'చెన్నయ్ అభిమానులు' పిలిచే పేరు 'తలా' అని. ఇదిలావుంటే  తమిళ హీరో విజయ్‌ని దళపతి అంటుంటారు అన్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే తలా ప్లస్ దళపతి.. ఈ కాంబినేషన్ ఎలా వుంటుంది.? ఇక విజయ్ క్రికెట్‌లోకి వెళుతున్నాడా.? లేదంటే, ధోనీ సినిమా నిర్మాణంలోకి వస్తున్నాడా.?లేదా  రెండోదే సాధ్యం కాబోతోందని అంటున్నారు.ఇకపోతే మహేంద్ర సింగ్ ధోనీ, అంతర్జాతీయ క్రికెట్‌కి ఎప్పుడో గుడ్ బై చెప్పేశాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. 

అయితే  ఇప్పుడు సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టబోతున్నాడు.ఇదిలావుంటే  ఈ మేరకు ఓ ప్రొడక్షన్ హౌస్‌ను ఏర్పాటు చేసే పనుల్లో బిజీగా వున్నాడు.కాగా  తనకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ పుణ్యమా అని తమిళ క్రికెట్ అభిమానుల నుంచి దక్కిన విశేష ఆదరాభిమానాల నేపథ్యంలో, మొట్టమొదటి సినిమా తమిళంలోనే చేయాలని ధోనీ అనుకుంటున్నాడని సమాచారం.ఇకపోతే తాజా సమాచారం ప్రకారం  విజయ్ హీరోగా ఓ సినిమా నిర్మించాలని మహేంద్ర సింగ్ ధోనీ ఫిక్సయిపోయాడని తెలుస్తోంది. అయితే అన్నీ అనుకున్నట్టు జరిగితే, అతి త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అధికారికంగా ప్రకటితం కానుందట.

ఇదిలావుంటే  దర్శకుడెవరన్నదానిపైనా ఇరువురి మధ్యా పలుమార్లు సంప్రదింపులు జరిగాయని సమాచారం.అంతేకాక భారీ బడ్జెట్‌తో ధోనీ నిర్మాణంలో విజయ్ హీరోగా సినిమా తెరకెక్కుతుందని తమిళ సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి. అయితే ధోనీ, ఈ సినిమాకి కేవలం నిర్మాతగానే వుంటాడా.?ఇక ఈ  సినిమాలో నటించేదేమన్నా వుందా.? లేదా...? వేచి చూడాల్సిందే.ఇక ప్రస్తుతం దళపతి విజయ్ వంశీ పైడిపల్లి తో ఓ సినిమా చేస్తున్నాడు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాని నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఇక దళపతి విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. తమిళంలో ఈ చిత్రానికి 'వరిసు' అని తెలుగులో 'వారసుడు' అని టైటిల్ ఖరారు చేసారు మేకర్స్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: