ప్రపంచ సినిమా పరిశ్రమలో అత్యుత్తమ అవార్డు అంటే ఆస్కార్. ఈ ఆస్కార్ అవార్డు సాధిస్తే ఎంతో గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు సినిమా వారం  ప్రపంచ సినిమా చరిత్రలో ఇప్పటివరకు ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు ఈ అత్యుత్తమ అవార్డు ను సాధించాయి. ఆ విధంగా ఇండియన్ సినిమాలకు ఈ ఆస్కార్ అవార్డు అందుకోవడం అనేది కలగానే మిగిలిపోయింది. అలాంటి కలను నెరవేర్చిన సినిమా స్లమ్ డాగ్ మిలియనీర్.

ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతానికి గానూ ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు లభించింది. ఎన్నో విశేషాలు కలిగిన ఈ సినిమాకు ఈ ఆస్కార్ అవార్డు రావడం ప్రశంసనీయమే అయినా ఆ తర్వాత మళ్లీ ఇండియన్ సినిమాకు ఆస్కార్ సినిమా అవార్డు దక్కడం అనేది జరగలేదు. ఎన్నో మంచి సినిమాలు వచ్చినా కూడా ఆస్కార్ నామినేషన్ లోకి కూడా వెళ్ళలేకపోయాయి ఇండియన్ సినిమాలు. ఆ విధంగా ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఓ సినిమా ఆస్కార్ బరిలో కి వెళ్తుంది అని వార్తలు రావడం విశేషం. 

అందులోనూ అది ఓ తెలుగు సినిమా కావడం మరింత విశేషం. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా విదేశాలలో విడుదల కాగా అక్కడ సైతం ఇది మంచి పేరును మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా కొంతమంది ఈ చిత్రం ఆస్కార్ బరి లోకి వెళ్లడం ఖాయం అని చెబుతున్నారు. దాంతో రాజమౌళి అభిమానులలో ఒక్కసారిగా సంతోషం వెల్లివిరిసినటు అయింది. ఎన్నో మంచి సినిమాలు చేసిన రాజమౌళి ఇప్పుడు చేసిన ఈ సినిమా ద్వారా ఆస్కార్ నామినేషన్ కు వెళ్తుంది అనే వార్తలు రావడం అనేది నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి. మరి ఈ చిత్రానికి ఆస్కార్ వరిస్తుందా అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడవలసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: