ఎస్ కల్యాణమండపం సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). కలర్ ఫొటో సినిమాతో హీరోయిన్‌గా మంచి బ్రేక్ తెచ్చుకుంది వైజాగ్ భామ చాందినీ చౌదరి (Chandini Chowdary).


ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం సమ్మతమే (Sammathame). జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుందట.. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో బిజీగా ఉంది కిరణ్, చాందినీ అండ్ టీం. కిరణ్‌-చాందినీ రీసెంట్‌గా అలీతో సరదా టాక్‌షోలో సందడిచేశారు. ఈ షోలో పలు విషయాలు కూడా పంచుకున్నారు.


‘చాందినీ చౌదరీ మాట్లాడుతూ..మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఎక్కువగా హీరోలను ఇమిటేట్ చేసేదాన్ని. రజినీకాంత్ సార్‌ను ఎక్కువగా ఇమిటేట్ చేసేదాన్ని. నాకు జనాలంటే విపరీతమైన భయం.స్టేజ్ గ్రూప్ డ్యాన్స్ ఉంటే వెనకాల ఎక్కడో వెళ్లి..ఎవ్వరికి కనిపించకుండా డ్యాన్స్ చేసే వ్యక్తిని నేను.ఏడో తరగతిలోనే సినిమా హీరోయిన్‌ను అవుతానని మా అమ్మకు చెప్పా. మనకయ్యేది కాదు లేఅమ్మా..మనకు అస్సలు బ్యాక్ గ్రౌండ్ లేదు..నువ్వు ఫొటోలు పట్టుకుని స్టూడియోల చుట్టూ తిరగలేవు..వద్దులే అనిచెప్పారు. ఆ తర్వాత మెకానికల్ ఇంజినీరింగ్ చేశానని చెప్పింది చాందినీ.


‘ఇంటర్మీడియట్ టైంలోనే నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలని బాగా ఉండేది. ఓ ఫ్రెండ్ ద్వారా సుభాష్ అనే వ్యక్తి నాకు పరిచయమయ్యాడు. అతడితో రాజ్‌తరుణ్ ఉండేవాడు. నేను, రాజ్ తరుణ్ కలిసి షార్ట్స్ ఫిలిమ్స్ కూడా మొదలుపెట్టాం. షార్ట్ ఫిలిమ్స్ చేసేటపుడు మొదటి అమ్మాయిని నేనే. అప్పుడు అమ్మాయిలెవరూ అస్సలు ఉండేవాళ్లు కాదు. షార్ట్ ఫిలిమ్స్ బాగా హిట్టయ్యాయి. ఆ తర్వాత సినిమా ఆఫర్లు కూడా రావడం మొదలయ్యాయి. కాకపోతే చదువు అయ్యాకే ఏదైనా అని మా ఇంట్లో చాలా ఖచ్చితంగా ఉండేవాళ్లు. నేనెప్పుడూ కూడా యాక్టింగ్ స్కూల్‌కు వెళ్లలేదు.


 


నన్ను నేను అద్దంలో చూసుకుని, ఇంతకు ముందు చేసిన వర్క్ చూసుకొని ఇంకా ఏది బెటర్ అని బాగా ప్రాక్టీస్ చేసేదాన్ని. చాలా మంది నీ ఏడుపు బాగా లేదనేవారు..అందుకోసం ఎంతో ప్రాక్టీస్ చేశాను. సంవత్సరాల పాటు ఏడవటం ప్రాక్టీస్ చేశాను. ఏడవటం కూడా అందంగా, చూడటానికి రియలిస్టిక్‌గా ఉండాలి..అని నేను ప్రాక్టీస్ చేశాను. అది కలర్ ఫొటో సినిమాలో గ్లిసరిన్ లేకుండా చాలా బాగా పండింది..చాలా సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చిందట చాందినీ చౌదరి.


ఇక సినీ పరిశ్రమలో మీ రోల్ మోడల్ ఎవరని ప్రశ్నించగా..తనకు ప్రత్యేకించి రోల్ మోడల్ అంటూ ఎవరులేరని..తన ప్రయాణమే తనకు రోల్ మోడల్ అని చెప్పాడట కిరణ్ అబ్బవరం.

మరింత సమాచారం తెలుసుకోండి: