తమిళ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంతే రేంజ్ లో మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరో విజయ్. ఇక ఈరోజు హీరో విజయ్ తన 48వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.విజయ్ తాను హీరోగా పీక్స్ లో వుండగానే తాను ప్రేమించిన అమ్మాయి సంగీత ను వివాహం చేసుకున్నారు. ఇక వీరిద్దరి పెళ్లి విషయంలో సినిమాను మించిన ట్విస్ట్ లు చాలా ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. విజయ్ తండ్రి కోలీవుడ్ ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ ఎస్.ఏ. చంద్రశేఖర్. ఇక ఈయన దర్శకత్వం వహించిన చాలా సినిమాలలో విజయ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఆ తర్వాత తండ్రి డైరెక్షన్లోనే వచ్చిన నాలయై తీర్పు అనే సినిమా ద్వారా విజయ్ హీరోగా పరిచయం అయ్యి.. మొదటి సినిమాతోనే మంచి యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈయన పెళ్లి ఇంకా అలాగే ప్రేమ విషయానికి వస్తే.. విజయ భార్య సంగీత విజయ్ కు పెద్ద వీరాభిమాని.ఇక యూకే లో నివసిస్తున్న సంగీత విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. సంగీత ముందుగా ఆమె విజయ్ కు తన ప్రేమను తెలిపి ప్రపోజ్ చేసింది. ఆ తర్వాత ఇరు కుటుంబాల వాళ్ళు ఒప్పుకున్న తర్వాత వీరు పెళ్లి చేసుకోని ఒక్కటయ్యారు. ఒకసారి సంగీత విజయ్ షూటింగ్ చేస్తున్న సినిమా సెట్ కి వెళ్లి అక్కడ విజయ్ ని చూసి ఆమె నేను మీ అభిమానిని అని చెప్పిందట.ఇక ఆ తర్వాత తరచుగా సంగీత విజయ్ షూటింగ్ స్పాట్ కు ఎక్కువగా వస్తూ ఉండేది. అలా వీరిద్దరి మధ్య ఏర్పడిన ప్రేమ ఇక ఆ తర్వాత పెళ్లి దాకా వెళ్ళింది.తరువాత వీళ్ళిద్దరూ 1999 వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు.


ఇక ఈ దంపతులకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. త్వరలోనే విజయ్ కుమారుడు కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే విజయ్ కుమారుడు డాన్స్ ఇంకా అలాగే ఫైట్స్ విషయంలో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఇక విజయ్ భార్య సంగీత అయితే ప్రస్తుతం గృహాణి గా బాధ్యతలు చేపట్టింది. విజయ్ కూడా ఒక్కో సినిమా చూస్తూ తన ఇమేజ్ ను బాగా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాడు. తెలుగులో హిట్ అయిన పలు చిత్రాలు పెళ్లిసందడి, పోకిరి, ఒక్కడు వంటి చిత్రాలను తమిళంలో రీమేక్ చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు విజయ్. ఇక ప్రస్తుతం ఈ ఏడాది బీస్ట్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో వచ్చాడు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. అయినా కానీ విజయ్ క్రేజ్ దక్కలేదు.ఇక ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు రాబోయే తెలుగు సినిమా వారసుడుకి ఏకంగా వంద కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: