ఇక కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సోషల్ మీడియా వేదికగా విజిల్ అనే పాటను కూడా విడుదల చేయడం జరిగింది. విజిల్ విజిల్ విజిల్ అంటూ సాగే ఈ సాంగ్ మాస్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఇందులో హీరో రామ్ పోతినేని మాస్ లుక్స్ లో డాన్స్ తో ఆకట్టుకుంటున్నారు అని చెప్పవచ్చు. జానీ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రాఫర్ గా చేశారు పూర్తి చెట్టు కూడా రామ్ కు పోటీగా డాన్స్ చేసిందని చెప్పవచ్చు. కృతి శెట్టి తో రామ్ రామ్ వేసినా హుక్ స్టెప్ ప్రేక్షకులను బాగా అలరిస్తోంది.
అటు విజువల్ గా ఈ సాంగ్ చాలా కలర్ ఫుల్ గా ఉన్నది.. దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన మాస్ బీట్ అదిరిపోయేలా ఉంది. ఈరోజు ది వారియర్ మొత్తం టీం మరియు మీడియా సమక్షంలో జరిగిన గ్రాండ్ ఈవెంట్లో మేకర్ ఈ విజిల్ పాటను విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని జులై 14 వ తేదీన తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో హీరో రామ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. అక్షర గౌడ కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నది.