తాజాగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా డిజిటల్ ప్లాట్ ఫామ్ పైనే పలు సినిమాలు సక్సెస్ అవుతున్నాయి . కాస్త లేటుగా పరిచయమయ్యాయి కానీ చాలా ఫాస్ట్ గా అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు. ఓ టి టీలు కరో నా సమయంలో వినోదాన్ని అందించే ప్రయత్నం సక్సెస్ ఫుల్ గా కొనసాగిందని చెప్పవచ్చు. కొన్ని నెలలపాటు థియేటర్లు మూత పడిన కూడా నిర్మాతలకు నష్టాల నుండి కాస్త బయటపడేశాయని చెప్పవచ్చు. పలు ఓటీటీ సంస్థలతో డీల్ సెట్ చేసుకొని పలు చిత్రాలు ఓటీటీ లో విడుదల చేశారు. ఇక ఇతర ఓటీటీ ల నుంచి పోటీ లో నిలవడానికి తమ కస్టమర్లను పెంచుకోవడానికి సరికొత్త ఆఫర్లతో పాటు సరికొత్త కంటెంట్లను కూడా అందిస్తూ ఉన్నాయి.


అంతే కాకుండా పెద్ద చిత్రాలను క్రేజీ సినిమాలను కూడా అనుకున్న సమయానికంటే ముందుగానే విడుదలవుతున్నాయి. ఈ విధంగా ఇటీవల కాలంలో అనేక పెద్ద చిత్రాలు నెల రోజులు కాకుండానే ఓటి టి లో  విడుదలయ్యాయి. డిజిటల్ రైట్స్ కోసం ఓటీటీ సంస్థలు భారీ రేటు ఆఫర్ చేస్తూ ఉన్నాయి. దీంతో నిర్మాతలకు ఎలాంటి అభ్యంతరం లేకుండా హ్యాపీగా ఓటీటి డీల్స్ ను సెట్ చేసుకుంటూ ఉన్నారు.

ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఈ మధ్య పేమెంట్స్ విషయంలో కాస్త కండీషన్స్ పెడుతున్నాయి అనే టాక్  వినిపిస్తున్నది. ముందుగా అనుకున్న ప్రకారం డబ్బులు చెల్లించకుండా కాస్త ఆలస్యంగా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓ టి టీలో స్ట్రిమ్మింగ్ అయిన కొన్ని వారాల నడుస్తున్న కూడా అమౌంట్ క్లియర్ చేయకుండా నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నట్లు సమాచారం. డబ్బులు సమయానికి అందక పోవడం వల్లే ఇతర ఫైనాన్సియల్ సెటిల్మెంట్ చేసుకోలేని పరిస్థితుల్లో ప్రొడ్యూసర్ ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. అయితే ఓ టి టి వల్ల ఎంత లాభం ముందు అంతే నష్టం ఉన్నది. డిజిటల్ ప్లాట్ ఫామ్ హవా పెరిగేకొద్దీ శాటిలైట్ రైట్స్ దారుణంగా పడిపోయాయి. దీంతో మొత్తం థియేటర్ల వ్యవస్థ పైన ప్రభావం చూపుతుంది. గత కొన్ని రోజుల నుంచి ఎక్కువగా థియేటర్లలో సినిమాలు చూడడం చాలా తగ్గిపోయిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: