సుహాన్ హీరోగా నటించిన కలర్ ఫోటో సినిమా ద్వారా మొదటిసారిగా హీరోయిన్గా నటించింది తెలుగు అమ్మాయి చాందిని చౌదరి. తెలుగు అమ్మాయి హీరోయిన్ గా ఎదగాలంటే చాలా కష్టం అది అసాధ్యం అంటూ కూడా అభిప్రాయం ఉన్న సమయంలో ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. కెరీర్ ప్రారంభం నుండి చాలా చక్కని పాత్రల్లో నటించి మెప్పించింది. స్కిన్ షో కి కాస్త దూరంగా ఉంటూ తన పాత్రకు పూర్తి న్యాయం చేసే విధంగా నటిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. పలు వెబ్ సిరీస్ లలో కూడా చాందిని చౌదరి నటించి మెప్పించింది.


ఎన్నో సూపర్ హిట్ సినిమాలు కీలకమైన పాత్రలో కూడా నటించింది. హీరోయిన్ గా ఈ మధ్య కాలంలో వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంది తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాను వదులుకున్న సినిమాల గురించి కూడా తెలియజేసింది. హీరోయిన్ గా చాందిని చౌదరి కెరీర్ ఆరంభంలోనే ఊహలు గుసగుసలాడే వంటి చిత్రంలో నటించే అవకాశం వచ్చిందట. సినిమాలో నటించాల్సిందిగా మేకర్స్ అడగగా ఆ సమయంలో ఈమె తనకు కాస్త సమయం కావాలని కోరిందట. కానీ  ఈమె స్పందించకపోవడంతో ఆ సినిమాలో హీరోయిన్ గా రాశి ఖన్నా ఎంపికై మంచి విజయాన్ని అందుకుంది.


ఇక ఆ తర్వాత కుమారి 21 ఎఫ్ సినిమా ఆఫర్ వచ్చిందట. ఈ చిత్రాన్ని సుకుమార్ శిష్యుడు తెరకెక్కించారు ఈ చిత్రం ఒక బోర్డు గర్ల్ కథ చక్కగా చూపించడం జరిగింది. కానీ ఈ సినిమాని కూడా చాందిని ఓకే చెప్పకుండా సున్నితంగా తిరస్కరించిందట. ఈ రెండు చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి కెరీర్ ప్రారంభంలోనే రెండు పెద్ద ప్రాజెక్టులు వదిలేసి ఇప్పుడు మంచిగానే ఆఫర్లను దక్కించుకుంటోంది. ఇక హీరోయిన్ల వరస సినిమాలు చేస్తున్న సమయంలోనే వెబ్ సిరీస్ లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: