పూజా హెగ్డే : కన్నడ ముద్దు గుమ్మ పూజా హెగ్డే గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జనగణమన సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో కూడా హీరోయిన్ గా నటించబోతోంది.
రష్మిక మందన : కన్నడ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది. రష్మిక మందన మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కాబోయే పుష్ప పార్ట్ 2 మూవీ లో నటించబోతోంది.
కృతి శెట్టి : ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో ది వారియర్ , ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచర్ల నియోజకవర్గం సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు నాగ చైతన్య వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటించబోతోంది.