కాంచన చిత్రంతో హర్రర్ కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచారు హీరో లారెన్స్. చివరిగా కాంచన 3 సినిమా విడుదలైంది .దాదాపుగా ఈ సినిమా వచ్చి మూడు సంవత్సరాలు అవుతోంది. ఈ నేపథ్యంలోనే మరొక పవర్ఫుల్ సినిమాతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి సిద్ధమయ్యారు లారెన్స్. తను నటిస్తున్న తాజా చిత్రం రుద్రన్ ఎవిల్ ఈజ్ నాట్ బోర్న్ నెట్ ప్లీజ్ క్రియేట్ అనే ట్యాగ్లైన్ కూడా ఉంచారు. ఫైవ్ స్టార్ క్రియేషన్ బ్యానర్ పై ఈ సినిమాని అత్యధిక భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.


రాఘవ లారెన్స్ సినిమాలోనే హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నది. ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. ఒకేసారి తెలుగు,  తమిళ భాషల్లో కూడా విడుదల కాబోతోంది. ఇటీవల ఈ సినిమా కూడా విడుదల చేసి సినిమాపై భారీగా అంచనాలను పెంచేశారు. ఇక ఈ రోజున ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన ఈ ఫస్ట్ లుక్ లో రాఘవ లారెన్స్ ఇంటెన్స్ అవతారంలో కనిపిస్తున్నారు.రాఘవ లారెన్స్ రుద్రతాండవం ఎలా ఉంటుందో సింపుల్ గా ఈ చిన్న పిక్ లో చూపించడం జరిగింది. ఇక ఈ సినిమా ట్యాగ్ లైన్ కి తగ్గట్టుగానే లారెన్స్ లుక్ ఈ సినిమాకి హైలెట్ గా కనిపించేలా కనిపిస్తోంది. తన చేతిలో ఆయుధం పట్టుకొని విలన్ల పై చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి విశేషం ఏమిటంటే కాంచన కాంబినేషన్ రిపీట్ అవుతూ ఉండడం గమనార్హం. ఇక ఇందులో శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. లారెన్స్ కు జోడిగా ప్రియ భవాని శంకర్ నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో పూర్ణిమ, నాజర్ తదితరులు కూడా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంతో లారెన్స్ మళ్లీ ట్రాక్ లోకి వస్తాడని చెప్పవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి: