కోలీవుడ్ స్టార్ హీరో గా సౌత్ లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న హీరోగా పేరుపొందాడు హీరో సూర్య. ఇక ఈయన భార్య జ్యోతిక కూడా తెలుగు ఇండస్ట్రీకి బాగా సుపరిచితమే. వీరిద్దరి వివాహం చేసుకొని వారి రియల్ లైఫ్లో కూడా ఎంతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకప్పుడు గ్లామరస్ పాత్రలు సైతం ఉన్నటువంటి జ్యోతిక.. సూర్య వివాహం అనంతరం అలాంటివాటికి దూరంగా ఉండి ఫ్యామిలీ లైఫ్ నీ మొదలు పెట్టింది. ప్రస్తుతం వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం ఈమె కుటుంబంతో చాలా సంతోషంగా ఉన్నది.


అయితే జ్యోతికని సూర్య సినిమాలనుండి విరామం ఇవ్వకుండా పలు సినిమాలలో నటించే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. అయితే రొటీన్ కమర్షియల్ పాత్రలు కాకుండా ఓ విభిన్నమైన పాత్రలో నటించేందుకు జ్యోతిక చాలా ఆసక్తి చూపిస్తోంది. అయితే వీరిద్దరు షూటింగ్ పనులు చాలా బిజీగా ఉండడం వల్ల ఫ్యామిలీ లైఫ్ ను ఏమాత్రం గడపలేక ఉన్నారు. అందుకోసం ఒక ప్లాన్ చేసుకున్నారు అప్పుడప్పుడు ప్రత్యేకమైన టూర్ వెళుతూ కాస్త సమయాన్ని గడుపుతూ ఉంటారు. రీసెంట్గా జ్యోతిక సూర్య ఇద్దరు కలిసి ఒక హాలిడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్నట్లు గా తెలుస్తోంది.
సూర్య జ్యోతిక ల  ఫోటో విషయానికి వస్తే ఒక బ్రిడ్జిపై ఇద్దరు కలిసి సెల్ఫీ ఫోటో దిగారు. ఇందులో వీరిద్దరి చూడడానికి చాలా చాలా చూడ ముచ్చటగా ఉన్నారు. ఇక జ్యోతిక విషయానికి వస్తే ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలతో చాలా బిజీగా ఉన్నది.. ఇక సూర్య కూడా ఇటీవల విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్ర చేసి ఆడియన్స్ కు బాగా అట్రాక్షన్ అయ్యేలా చేశారు. ప్రస్తుతం సూర్య రెండు చిత్రాల లో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం సూర్య ,జ్యోతిక  ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: