నందమూరి కళ్యాణ్‌ రామ్‌ హీరోగా ఇప్పటి వరకు సాధించిన విజయాలు చాలా తక్కువనే చెప్పాలి. ఎంత తక్కువంటే చేతి వేళ్ళ పై లెక్క పెట్టొచ్చు. అవును ఆయన కెరీర్లో వున్నది కేవలం రెండే రెండు హిట్లు. అందులో ఒకటి అత్తనొక్కడే కాగా రెండోది పటాస్. ఆ రెండు తప్ప ఆయనకీ హిట్లమి లేవు. ఇక ఆయన గత హిట్‌ సినిమా ఏదీ అంటే చాలా సంవత్సరాలు వెనక్కు వెళ్లి పటాస్ సినిమా అనే చెప్పాల్సిందే.ఇక అంతకు ముందు హిట్ అంటే ఆయన కెరీర్ ఆరంభం అత్తనొక్కడే వరకు వెళ్లాల్సిందే. ఈ రెండు సినిమాలతో తప్ప ఇప్పటి వరకు ఆయన కమర్షియల్‌ గా ఎప్పుడు కూడా మెప్పించలేక పోయాడు. అయినా కూడా భారీ బడ్జెట్‌ సినిమాలను చేస్తున్న ఘనత కళ్యాణ్ రామ్ దక్కించుకున్నాడు. ఇక ఆ మద్య ఓమ్ అంటూ ఓ త్రీడి సినిమాను చేసి చేతులు కాల్చుకున్న నందమూరి కళ్యాణ్ రామ్‌ ఇప్పుడు బింబిసారా అంటూ ఒక భారీ బడ్జెట్ సినిమా ను చేస్తున్నాడు. తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా సినిమా విడుదల తేదీ పై క్లారిటీ కూడా వచ్చింది. ఎట్టకేలకు బింబిసారా సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో అభిమానుల్లో ఇంకా అలాగే ఇండస్ట్రీ వర్గాల్లో కూడా చర్చ అనేది మొదలు అయ్యింది.


ఆగస్టు నెలలో విడుదల కాబోతున్న బింబిసార సినిమాను ఇక ఏకంగా 40 కోట్ల బడ్జెట్‌ తో నిర్మించారని సమాచారం తెలుస్తోంది. ఒక ప్లాప్‌ హీరో పైగా అది కూడా పది కోట్ల మార్కెట్ కూడా లేని హీరో కు అంత బడ్జెట్‌ ఎలా సాధ్యం అంటూ అంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. బింబిసార సినిమా అయితే అసలు వరుసగా వార్తల్లో నిలుస్తూనే ఉంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ప్రోత్సాహం వెనుక ఉన్నా కూడా బింబి సార సినిమా బ్రేక్‌ ఈవెన్‌ సాధించడం అంటే దాదాపు అసాధ్యం అన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో ప్రేక్షకులు వరుసగా అన్ని ప్లాప్స్ పడుతున్నా కూడా బింబిసారా సినిమా కు ఏకంగా 40 కోట్లు ఎలా పెట్టావు కళ్యాణ్ రామ్‌ అంటూ చాలా మంది కూడా సోషల్‌ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ సినిమా ను స్వయంగా కళ్యాణ్ రామ్‌ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నాడట.దీన్ని సోషియో ఫాంటసీ మూవీ గా ఈ సినిమాను రూపొందించారని సమాచారం తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: