ప్రస్తుతం సినిమా తీయడం ఒక ఎత్తు అయితే సినిమాను జనంలోకి తీసుకు వెళ్ళడానికి రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా చిన్న సినిమాల విషయంలో ప్రేక్షకులను ధియేటర్ల వరకు రప్పించడానికి నానాపాట్లు పడుతున్నారు. ‘ఎస్ ఆర్ కళ్యాణ మండపం’ మూవీతో మంచి పేరు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం తన కెరియర్ ను మరింత ముందుకు తీసుకు వెళ్ళడానికి నేడు విడుదల అవుతున్న ‘సమ్మతమే’ విజయం పై ఆశలు పెట్టుకున్నాడు.



అయితే ఈరోజు రిలీజ్ అవుతున్న ఈచిన్న సినిమాతో మరో నాలుగు చిన్న సినిమాలు పోటీపడటంతో దీనితో ఈ హీరో మూవీకి కనీసం వీకెండ్ వరకైనా కలక్షన్స్ వస్తాయా అన్న సందేహం చాలామందిలో ఉంది. దీనితో ఈ యంగ్ హీరో ఒక కొత్త స్ట్రాటజీ ఆలోచనలు చేస్తున్నాడు. ఈరోజు ఉదయం తన సినిమాను కొన్ని ధియేటర్లలో ఉచితంగా ప్రదర్శిస్తున్నట్లుగా ప్రచారం మొదలుపెట్టి ఆవిధంగా అయినా తన సినిమాకు హౌస్ ఫుల్ బోర్డు పడుతుందేమో అన్న ఆశతో ఉన్నాడు.



దీనికి సంబంధించి ఒక వీడియోను రిలీజ్ చేస్తూ ఈ యంగ్ హీరో తన సినిమాను ఎందుకు చూడాలి అనుకుంటున్నారో కామెంట్స్ పెడితే వారందరికీ వారు ఏరియాలోని ధియేటర్లలో ఈ సినిమా చూడటానికి ఉచితంగా టిక్కెట్లు పంపుతానని నిన్న సాయంత్రం ప్రకటించాడు. అంతేకాదు తన సినిమా చాల బాగుంటుంది అని చెపుతూ అందర్నీ తన సినిమా ధియేటర్ల వైపు రమ్మని పిలుపు ఇచ్చాడు.


 
‘టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయని భావిస్తూ సమ్మతమే సినిమా చూడలేకపోతే వాళ్లకు నేను ఫ్రీగా టికెట్లు ఇస్తాను. వాళ్లు, ఎవరో సినిమా చూసి చెప్పడం కాదు స్వయంగా మీరంతా చూసి సినిమా ఎలా ఉందో చూడని వాళ్ళకు చెప్పండి. మీరంతా సినిమాను థియేటర్లలకు రావాలని నా కోరిక. అందుకే ఇలా ఉచితంగా టికెట్లు ఇస్తున్నాను.’ అంటూ ఈ యంగ్ హీరో చేసిన ప్రకటనకు ఎలాంటి స్పందన ఈరోజు వస్తుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: