టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన నితిన్ ప్రస్తుతం ఏం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాచర్ల నియోజకవర్గం మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే . ఈ మూవీ లో నితిన్ సరసన కృతి శెట్టి , క్యాథరిన్ హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు .

మూవీ ని దర్శకుడు ఏం ఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ నేపథ్యం కలిగిన కథతో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది . మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీ కి ప్రసాద్ మూరెళ్ల సినిమాటో గ్రాఫర్ గా పని చేస్తున్నాడు . ఈ మూవీ ని ఆగస్టు 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది . మాచర్ల నియోజక వర్గం మూవీ కి సంబంధించిన ఒక పాట మినహా మిగతా షూటింగ్ మొత్తం పూర్తి అయినట్లు ఒక న్యూస్ బయటకు వచ్చింది . దీనితో మిగిలి ఉన్న ఒక్క పాట షూటింగ్ ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి చిత్ర బృందం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించ నున్నట్లు తెలుస్తోంది .

మాచర్ల నియోజక వర్గం మూవీ లో నితిన్ గుంటూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ రెడ్డి పాత్రలో కనిపించబోతున్నాడు .  ఇప్పటికే మాచర్ల నియోజక వర్గం చిత్ర బృందం ఈ సినిమా నుండి విడుదల చేసిన పోస్టర్ లకు  ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది . ఇది ఇలా ఉంటే మాచర్ల నియోజక వర్గం మూవీ తర్వాత నితిన్ , వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: