ఎట్టకేలకు ఈ చిత్రం జూలై 14న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. అందుకోసమే ఈ సినిమా నుంచి వరుస డేట్లు ఇస్తున్నారు చిత్రబృందం. ఇకపోతే ఈ మూవీ పై బోలెడు ఆశలన్ని పెట్టుకుంది హీరోయిన్ కృతి శెట్టి. అందుకు కారణం ఏమిటంటే ది వారియర్ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల కాబోతోంది. తెలుగులో ఒకేసారి హ్యాట్రిక్ సినిమాలో తన ఖాతాలో వేసుకుని మంచి క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు పొందింది . ఈ చిత్రంతో తమిళ ప్రేక్షకులను కూడా మొదటిసారి అలరించబోతోంది.. అందుచేతనే ఈ సినిమా గనుక విజయం సాధిస్తే కోలీవుడ్లో కూడా పూర్తిచేసి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతుందనే నమ్మకం ఉన్నదట.
దీంతో అటు టాలీవుడ్ ఇటు కోలీవుడ్ లో కూడా తన సత్తా చాటాలని కృతి శెట్టి భావిస్తున్నదట. అందుకే ది వారియర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కావాలని ఆమె కోరుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.మరి ఆమె ఆశ నిజమైతే ఈ చిత్రం నుండి పలు భాషలలో మంచి విజయాన్ని సాధిస్తుందా లేదా అన్న విషయం తెలియాలంటే వేచి ఉండాల్సిందే. ప్రస్తుతం కృతి శెట్టి ఇతర ప్రాజెక్టుల విషయంలో చాలా బిజీగా ఉన్నది. తమిళంలో కూడా హీరో సూర్య సరసన ఒక చిత్రంలో నటించబోతున్నదని సమాచారం.