యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటించిన 'ఆర్ ఆర్ ఆర్' మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. అలా 'ఆర్ ఆర్ ఆర్' మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ మరి కొన్ని రోజుల్లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నాడు.

సినిమా ఎన్టీఆర్ కు కెరియర్ పరంగా 30 వ సినిమా. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన చిత్ర బృందం విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే  సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే... ఎన్టీఆర్,  కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ లో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించి ఎవరు అనేది ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే కొంత కాలం క్రితం ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటించబోతుందని, ఆ తర్వాత రష్మిక మందన హీరోయిన్ గా నటించబోతుందని, ఆ తర్వాత సాయి పల్లవి హీరోయిన్ గా నటించబోతోంది అని అనేక వార్తలు బయటకు వచ్చాయి. కాకపోతే ఆ వార్తలపై ఇప్పటి వరకు చిత్ర బృందం  ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాల్లో ఎన్టీఆర్ సరసన నటించడానికి ఇద్దరు కన్నడ ముద్దుగుమ్మలు పోటీ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఆ ఇద్దరు కన్నడ ముద్దుగుమ్మలు మరెవరో కాదు... ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి,  పెళ్లి సందD సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీల.  ఎన్టీఆర్ 30వ సినిమాలో ఈ ఇద్దరిలో ఎవరినో ఒకరి హీరోయిన్ గా తీసుకోవాలని చిత్ర బృందం ఆలోచనలో ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: