ఇక హీరో వైష్ణవ్ తేజ్ గత చిత్రం కొండపొలం సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. దీంతో ఇప్పుడు నటిస్తున్న సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో హీరోయిన్ గా కేతికశర్మ నటిస్తున్నది షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్ ని ప్రారంభించడం జరిగింది ఇప్పటికీ లిరికల్ వీడియోలను కూడా విడుదల చేసి సినిమాపై మంచి హైప్ ని తీసుకురావడం జరిగింది తాజాగా ఈ రోజున ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను కూడా విడుదల చేశారు.
ఇక ఈ టీజర్ విషయానికి వస్తే.. ఒకరంటే ఒకరికి ప్రేమ ఉన్నా యుగో కారణం వల్ల వీరిద్దరూ కాస్త దూరంగా ఉంటారు. ఇక వీరిద్దరూ కూడా ఇందులో మెడికల్ స్టూడెంట్ లో కనిపిస్తారు ఇందులో లవ్ రొమాంటిక్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను అలరించేలా ఉన్నాయి. ఇక వైష్ణవ తేజ్ కూడా ఈ చిత్రంలో సరికొత్త డైలాగులతో ప్రేక్షకులను అలరించే విధంగా ఉన్నారు. ఇక హీరో హీరోయిన్ల మధ్య కొన్ని డైలాగులు ఈ సినిమాకి హైలైట్గా నిలిచే లా ఉన్నాయి. వైష్ణవ తేజ్, కేతిక శర్మ ల మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు కెమిస్ట్రీ బాగా విశేషంగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. మరి ఈ చక్కటి కలర్ ఫుల్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైన్మెంట్ చిత్రం ఎలా ఉండబోతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.