టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును  తెచ్చుకున్న రవితేజ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రవితేజ తన కెరియర్ లో ఎంతో మంది కొత్త దర్శకులకు ఛాన్స్ ఇచ్చి వారితో అదిరిపోయే హిట్ సినిమాలను అందుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. రవితేజ నటించిన సినిమా దర్శకులు కొత్తవారా,  పాత వార వారా,  ఇది వరకు ఆ దర్శకులకు మంచి విజయాలు ఉన్నాయా లేదా అనేది ఏమీ ఆలోచించ కుండా కేవలం వారికి ఉన్న టాలెంట్ గురించి మాత్రమే ఆలోచించి అవకాశాలు ఇస్తూ ఉంటాడు.

అలా ఎంతో మంది కొత్త దర్శకులతో,  ప్లాప్ లలో ఉన్న దర్శకుల సినిమాల్లో నటించి మంచి విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు. అలాగే రవితేజ, రమేష్ వర్మ దర్శకత్వంలో వీర సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేకపోయింది. ఆ తర్వాత రమేష్ వర్మ 'రాక్షసుడు' సినిమాతో మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు. అలా రాక్షసుడు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రమేష్ వర్మ కు రవితేజ మళ్లీ అవకాశం ఇచ్చాడు. అందులో భాగంగా రమేష్ వర్మ,  రవితేజ తో ఖిలాడి సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా  రెండు సార్లు రవితేజకు బాక్సాఫీస్ దగ్గర అపజయలను అందించిన రమేష్ వర్మ కు మరో ఛాన్స్ ను రవితేజ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

రవితేజ పెద్ద తమ్ముడు రఘు కొడుకు.. మాధవ్ హీరోగా తొలి ఎంట్రీకి సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మంచి టెక్నిల్ వేల్యూస్ తో, ప్రముఖ తారాగణంతో ఈ మూవీ ని నిర్మించబోతున్నారని ఒక టాక్ నడుస్తుంది.  ఈ మూవీ కి రమేశ్ వర్మ కథ మరియు మాటలు, స్ర్కీన్ ప్లే ను మాత్రమే అందించనున్నట్లు తెలుస్తోంది. కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా రవితేజ మరోసారి రమేష్ వర్మ ను నమ్మినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: