టాలీవుడ్ లో గత కొన్ని సంవత్సరాల క్రితం హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన హీరోలు చాలా మంది ఉన్నారు. వారిలో కొందరు ఇప్పటికే పెళ్లి చేసుకుని సంసారం జీవితాన్ని ఎంజాయ్ చేస్తుండగా, మరి కొందరు హీరోలు మాత్రం ఇంకా కెరీర్ లో ఏదో సాధించాలి అన్న పట్టుదలతో పెళ్లిళ్లు కూడా మానేసి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అలా బ్యాచిలర్ లైఫ్ ను లీడ్ చేస్తున్న స్టార్ హీరోల్లో రామ్ పోతినేని కూడా ఒకరు. ఈ హీరో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఈ మధ్య చాలా వార్తలే వినపడుతున్నాయి. అయితే నిన్నటి వరకు అలాంటిదేమీ జరగలేదు.. కానీ ఇపుడు తాజాగా వినిపిస్తున్న వార్త ప్రకారం హీరో రామ్ పోతినేని పెళ్లికి రెడీ అయినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

రామ్ ది కూడా ప్రేమ వివాహమే అని సమాచారం. అవును హీరో రామ్ అతి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ఇండస్ట్రీలో అంతా అనుకుంటున్నారు. రామ్ చిన్ననాటి స్నేహితురాలిని ప్రేమ వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.  ఇప్పటికే ఇరువురు ఇంటి సభ్యులు కూడా పెళ్లి మాటలు మాట్లాడుకున్నారు అని, రామ్ ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు పెళ్లి మాటలు మొదలెట్టేసారు అని దానికి ముహూర్తం కూడా ఖరారు చేశారని సమాచారం.

మరి రామ్ చిన్న నాటి స్నేహితురాలు ఎవరు ? ఎప్పుడు వీరు పెళ్ళికి ముహూర్తం అన్నది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. కాగా రామ్ తాజాగా నటించిన ది వారియర్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇప్పటి వారికి ఈ సినిమా నుడ్ని విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ మరియు ట్రైలర్ అందరినీ ఎంత గానో ఆకట్టుకుని అంచనాలను భారీగా పెంచాయి. ఈ చిత్రానికి తమిళ్ దర్శకుడు లింగుస్వామి డైరెక్ట్ చేయడం విశేషం. ఇది తమిళ మరియు తెలుగు భాషలలో విడుదల కానుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: