ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ఒక వెలుగు వెలుగుతున్న దర్శకుడి పై చాలామంది స్టార్ హీరోలు అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అతను రచయిత గా తన కెరీర్ ని మొదలు పెట్టి ఆ తర్వాత రోజుల్లో డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఎంతో మంది హీరోలకు మంచి విజయాలను అందించిన అగ్ర దర్శకుడిగా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చలామణీ అవుతున్నారు. ఇక టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకులలో ఈయన కూడా ఒకరి గా చలామణి అవుతూ ఉండడం గమనార్హం.

ఇకపోతే ఈ దర్శకుడు ఇప్పటివరకు మంచి విజయాలను సొంతం చేసుకొని.. ఇప్పుడు ఒక స్టార్ హీరో తో సినిమా చేసే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు. కానీ పరిస్థితులను చూస్తూ ఉంటే ఈ స్టార్ దర్శకుడు తన సొంత సినిమాలపై దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు ఎందుకంటే ఒక బిగ్ స్టార్ తో సినిమా చేస్తున్నారు..అంటే ఎంత పెద్ద ఎత్తున ప్రచారం చేపడతారు అని అందరికీ తెలిసిందే. అయితే ఈ దర్శకుడు మాత్రం ఇప్పటివరకు ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. ఇకపోతే అప్పుడెప్పుడో అనౌన్స్ చేయబడిన ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి రాకపోవడం.. ఫైనల్ డ్రాఫ్ట్ ఇంకా లాక్ కాకపోవడమే అని కూడా చెబుతున్నారు.


పోతే  ఆ స్టార్ హీరోకి ఈ దర్శకుడు ఫైనల్ నరేషన్ ఇవ్వగా సెకండాఫ్ విషయంలో ఆ స్టార్ హీరో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని సమాచారం. అంతేకాదు కొన్ని మార్పులు కూడా చేయాలని ఆ దర్శకుడికి సూచించారట. ఇక డైరెక్టర్ కూడా స్టార్ హీరో చెప్పినట్లుగానే కథలో మార్పులు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇకపోతే రెండేళ్ల క్రితమే బేసిక్ ఐడియాను లాక్ చేసిన ఈ దర్శకుడు ఇప్పటివరకు ఫైనల్ స్క్రిప్టును రెడీ చేయకపోవడం గమనార్హం. ఇక అతను తన నిర్మాణ సంస్థలో రూపొందించే సినిమా కథల పై దృష్టి పెట్టడం వేరే హీరో చేసే ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం వల్లే ఈ సినిమా ఆలస్యం అవుతోందని పలువురు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: