మెగా హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే.. ఈమె పలు సేవా కార్యక్రమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది. ఇక ఉపాసన కొణిదల అపోలో లైఫ్ కి వైస్ చైర్మన్ గా ఉన్నది. ప్రస్తుతం విధులు కూడా నిర్వహిస్తోంది. ఈమె పలు సేవా కార్యక్రమాలలో చాలా బిజీగా ఉంటుంది జంతు ప్రేమికురాలిగా ఎన్నో వందల జంతువులను సంరక్షిస్తున్న ది. ఇక అంతే కాకుండా పర్యావరణానికి సంబంధించి ఎన్నో చారిటీ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉంటుంది. ఇక వివిధ ప్రాంతాలలో ఉన్న కొన్ని రుద్ర ఆశ్రమాలకు తన వంతు సహాయం చేస్తూ ఉంటుంది.


ఇప్పటికే పలు సామాజిక కార్యక్రమాలలో కూడా పలువురి ప్రశంసలు అందుకుంటూ ఉంటుంది ఉపాసన ఇప్పుడు తాజాగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ తెలియజేయడం జరిగింది దీంతో మళ్లీ వార్తల్లో నిలిచింది. వన్యప్రాణులంటే ఎంతో మక్కువ చూపించే ఉపాసన.. అపోలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ గా ఉంటూనే మంచి నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వన్యప్రాణి సంరక్షణ కోసం జంతు జీవరాసుల పోషణ కోసం పనిచేసే వారికి తమ హాస్పిటల్లో ఉచిత వైద్యాన్ని ఇవ్వబోతున్నట్లు ఉపాసన నిర్ణయం తీసుకున్నది.


ఇందుకోసం అపోలో ఫౌండేషన్ డబ్ల్యు డబ్ల్యు ఎఫ్ కలిసి పని చేయనున్నట్లుగా తెలియజేసింది. మెగా కోడలిగా, అపోలో హాస్పిటల్ వైస్ చైర్మన్ గా ఈ బాధ్యత తీసుకోవడంతో ప్రతి ఒక్కరు ఈమెను అభినందిస్తున్నారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికలో ఒక పోస్ట్ చేయడం జరిగింది. వన్య ప్రాణి సంరక్షణలో భాగంగా అడవిలో గాయాలపాలైన కొంతమంది ఫారెస్ట్ రేంజర్ లు ఇతర అధికారులు సిబ్బందికి ఎలాంటి వైద్య సేవలను ఉచితంగా అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలియజేసింది. ఉపాసన చేసిన పోస్ట్ ప్రస్తుతం చాలా వైరల్ గా మారుతోంది. ఉపాసన నిర్ణయం పట్ల తన కుటుంబ సభ్యులు ఇతర ప్రముఖులు సైతం చాలా ఆనందాన్ని తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: