నాలుగో సినిమాతో తొలి విజయాన్ని అందుకున్న అఖిల్ ఇప్పుడు ఏజెంట్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టులో విడుదల కాబోతుంది దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాకపోవడం తో అతని అభిమానులు ఎంతగానో నిరాశగా ఫీలవతున్నారు. తొలి మూడు సినిమాలు అఖిల్ కి చేదు అనుభవాన్ని మిగిల్చాయి. దాంతో బొమ్మరిల్లు భాస్కర్ తో కలిసి చేసిన సినిమా విజయం వంతం అయ్యింది.


పోయిన ఏడాది దసరా కి విడుదల అయిన ఈ సినిమా తో అఖిల్ తొలి విజయాన్ని అందుకుని ఏజెంట్ సినిమాపై అంచనాలు భారీ గా పెంచింది. సురేందర్ రెడ్డి లాంటి దర్శకుడు ఈ సినిమా కి దర్శకత్వం అందించడం తో ఈ సినిమా పై ఇంతటి అంచనాలు పెరిగాయి. దానికి తోడు ఈ సినిమా యొక్క లుక్స్ కూడా అందరిని ఎంతో మెప్పించదాంతో ఆ అంచనాలు ఇప్పుడు రెట్టింపు అయ్యాయని చెప్పవచ్చు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా స్టైలిష్ యాక్షన్ సినిమా గా తెరకెక్కుతున్న సినిమా కావడం విశేషం.

ఇక ఈ సినిమా పై మొదట్లో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ నెలకొనగా ఆ తర్వాత సినిమా పై కొంత నెగెటివ్ రిమార్క్ ఏర్పడింది అని చెప్పవ చ్చు. దానికి కారణం ఈ సినిమా మధ్య లో కొన్ని ఆర్థిక కారణాల వల్ల ఆగిపోయింది అన్న వార్తలు రావడం ఈ సినిమా ఈ స్థాయి లో నెగెటివ్ రిమార్క్ లో పడిపోయింది. మరి ఈ సినిమా ఆగస్ట్ లో విడుదల అవుతుందన్న నేపథ్యంలో ఏ విధంగా ఈ సినిమా పాజిటివ్ వైబ్రేషన్స్ ని తెచ్చుకుంటుంది చూడాలి. తమన్సినిమా కి సంగీతం సమకూరుస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా యొక్క అప్డేట్ లు విడుదల చేస్తామని చిత్ర బృందం వెల్లడిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: