మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పలు సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి.  వాటిలో ముందుగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం విడుదల కాబోతుంది.  ఈ సినిమా యొక్క షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.  ఈ సినిమాకి ఇంకా టైటిల్ నిర్వహించలేదు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పలు టైటిల్స్ పరిశీలన లో ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రామ్ చరణ్ సినిమాతో తన పాన్ ఇండియా ఇమేజ్ ను అదే స్థాయి లో కొనసాగించాలని భావిస్తున్నాడు.

శంకర్ లాంటి దర్శకుడితో సినిమా ఓకే చేసుకోవడమే రామ్ చరణ్ సాధించిన సగం విజయం అని మెగా అభిమానులు అప్పట్లో చెప్పారు. అలాంటి దర్శకుడితో చేస్తున్న ఈ సినిమా వేరే స్థాయిలో ఉంటుంది అని కూడా జోస్యం చెప్పారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క అవుట్ పుట్ ప్రకారం తప్పకుండా భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందని చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమా యొక్క టైటిల్ ని రివీల్ చేయబోతున్నారు అని అంటున్నారు. సర్కారోడు అనే టైటిల్ ను పరిశీలించిన చిత్ర బృదం చివరికి సిటిజన్ అనే టైటిల్ ని ఫిక్స్ అయ్యారని అంటున్నారు. కథ  ప్రకారం ఈ  టైటిల్ బాగుంతుందని ఫైనల్ గా ఈ టైటిల్ను ఓకే చేసే ఆలోచనలో ఉంది. 

మరి ఈ సినిమా కి ఏ టైటిల్ పెట్టారన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే. కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో సునీల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. మరి శంకర్ కి కలిసి రాణి ఈ టైం లో చేస్తున్న ఈ భారీ సినిమా ఆయనను హిట్ ట్రాక్ లోకి ఎక్కిస్తుందా అనేది చూడాలి. దిల్ రాజు ఈ సినిమా ను 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: